గౌతమీపుత్రశాతకర్ణి ఆడియో & రన్ టైమ్ డీటైల్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి విజయం సాధించాలి అని కోరుకుంటూ అభిమానులు ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, క్రిష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ...గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని బాలకృష్ణ తప్ప ఇంకొకరు చేయలేరు. ఎన్నో పౌరాణిక పాత్రలు చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ కు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్ర తీరని కోరికగా మిగిలిపోయింది. ఆ కోరికను బాలకృష్ణ నెరవేర్చారు. ఇక సినిమా విషయానికి వస్తే...79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. డిసెంబర్ 16న తిరుపతిలో భారీ స్ధాయిలో ఆడియో ఫంక్షన్ చేయనున్నాం. రన్ టైమ్ 2 గంటల 12 నిమిషాలు. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్ జరుగుతుంది. అభిమానులతో పాటు ప్రతి తెలుగువాడు గర్వపడేలా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ఉంటుంది అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com