గౌతమీ బాలశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డ్రీమ్ గర్ల్ హేమమాలిని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలశ్రీగా నటిస్తున్నారు. శ్రియ వశిష్టి దేవి, బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసారు.
ఆతర్వాత విజయదశమికి టీజర్ రిలీజ్ చేయడం 2 మిలియన్ వ్యూస్ రావడం తెలిసిందే. ఈనెల 16న హేమమాలిని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ మోస్ట్ పవర్ ఫుల్ మదర్ గౌతమీబాలశ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ భారీ చిత్రాన్ని జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సమర్పణ - బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ - భూపేష్ భూపతి, కెమెరామెన్ - జ్ణానశేఖర్, సంగీతం - చిరంతన్ భట్, లిరిక్స్ - సిరివెన్నెల సీతారామశాస్త్రి, డైలాగ్స్ - బుర్రా సాయిమాధవ్, ఫైట్స్ - రామ్ లక్ష్మణ్, కో-ప్రొడ్యూసర్ - కొమ్మినేని వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్స్ - వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాబాబు, డైరెక్టర్ - క్రిష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com