తెలుగు »
Cinema News »
చైతన్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా సాహసం శ్వాసగా సాగిపో - గౌతమ్ మీనన్
చైతన్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా సాహసం శ్వాసగా సాగిపో - గౌతమ్ మీనన్
Monday, October 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా నటించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని రవీందర్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని నవంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.... ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించిన సాహసం శ్వాసగా సాగిపో సాంగ్స్ సక్సెస్ అయ్యాయి. అలాగే సినిమా కూడా సక్సెస్ అవుతుంది. గౌతమ్ మీనన్ గారి సినిమాల్లో ఏమాయచేసావే, ఘర్షణ సినిమాలు నాకు బాగా ఇష్టం. ఈ రెండు సినిమాలను ఇంకోలా తీస్తే ఎలా ఉంటుందో సాహసం శ్వాసగా సాగిపో సినిమా అలా ఉంటుంది అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ... నేను సత్య సినిమా ద్వారా రైటర్ గా పరిచయం అయ్యాను. రామ్ గోపాల్ వర్మ గారు దగ్గర వర్క్ చేయడం వలన సినిమాల్లో సౌండ్ ఇంపార్టెన్స్ ఏమిటో తెలుసుకున్నాను. అలాగే దిల్ సే సినిమాకి మణిరత్నం దగ్గర వర్క్ చేసాను. అలాగే కరుణాకరన్, వినాయక్...ఇలా చాలా మంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసాను. ప్రతి సినిమాతో ఏదో కొత్త విషయం నేర్చుకుంటుంటాను. ఇక గౌతమ్ మీనన్ దగ్గర వర్క్ చేయడం అనేది డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఆయన కథలో ఉన్న సోల్ ని బిలీవ్ చేస్తారు. చైతు డిఫరెంట్ ఏక్టర్. ఏమాయచేసావే సినిమాలో పక్కింటి అబ్బాయిలా కనిపించాడు. ఇందులో సాధారణంగా ఉండే కుర్రాడుని విధి చిక్కుల్లో పడేస్తే ఎలా దాని నుంచి బయటపడ్డాడు అనేది ఈ కథ. ఆడియోన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా ఉండే సినిమా ఇది. మంజిమ పాత్రకు తగ్గట్టు చాలా చక్కగా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు చూసి నచ్చడంతో నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దిల్ రాజు జడ్జెమెంట్ ను నమ్ముతాను. సో...ఖచ్చితంగా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ... జోష్ తర్వాత చైతన్య ఏమాయచేసావే సినిమా చేస్తుంటే...సాఫ్ట్ లవ్ స్టోరీ చేస్తున్నాడు ఏమిటి పిచ్చా అనుకున్నాను. ఆతర్వాత ఆ సినిమా ఎంత పెద్ద సక్సస్ అయ్యిందో తెలిసిందే. సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి సంవత్సరంన్నర నుంచి వింటున్నాం. ఆడియో బాగానే ఉంది కానీ...నేను ఎందుకనో నేను అంతగా ఈ సినిమాని పట్టించుకోలేదు. అయితే...ఈ సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి ట్రైలర్ చూపించాడు. ట్రైలర్ చూసిన తర్వాత బాగుంది అనిపించి సినిమా చూసాను. ఫస్టాఫ్ ఏమాయచేసావే అయితే సెకండాఫ్ ఘర్షణ. చైతు, మంజిమ క్యారెక్టర్స్ కి తగ్గట్టు పర్ ఫార్మ్ చేసారు. కొత్త ప్రయత్నం ఇది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు అందరికి నచ్చుతుంది. 2.15 నిమిషాలు నిడివి. నవంబర్ 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... ఈ సినిమాని రెండు సార్లు చూసాను. చైతన్య, మంజిమమోహన్, గౌతమ్ మీనన్ కు సూపర్ హిట్ సినిమా ఇది. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ టేకింగ్ వలన ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది. ఈ సినిమా యూత్ & మాస్ కి బాగా నచ్చుతుంది అన్నారు.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ... ప్రేమమ్ తో చైతన్య సక్సెస్ సాధించాడు. ప్రేమమ్ సక్సెస్ తో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. దిల్ రాజు గారు, బెల్లంకొండ సురేష్ గారు మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాక్సంక్స్ తెలియచేస్తున్నాను. దిల్ రాజు గారు ఈ సినిమా చూసి చాలా బాగుంది అంటూ నాకు ఫోన్ చేసి అభినందించారు.మంజిమ చాలా బాగా నటించింది. ఏమాయచేసావే సినిమాలో చైతన్య బాయ్ అయితే...ఈ సినిమాలో బాయ్ మేన్ లా ఎలా మారాడు అనేది చూపించాను. చైతన్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా అవుతుంది అన్నారు.
హీరోయిన్ మంజిమ మోహన్ మాట్లాడుతూ... ఎ.ఆర్.రెహమాన్ వండర్ ఫుల్ మ్యూజిక్ అందించారు. చైతన్యతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్ సార్ కి థ్యాంక్స్ అన్నారు.
చైతన్య మాట్లాడుతూ... రెండు మూడు రోజుల్లో సెన్సార్ పూర్తవుతుంది. నవంబర్ 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. గౌతమ్ మీనన్ తో వర్క్ చేయడంతో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఆయన కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్ముతారు. ప్రేమమ్ లో నేను బాగా నటించాను అంటే దానికి కారణం గౌతమ్ మీనన్ గారి సినిమాల్లో నటించడం వలనే. ఈ సినిమా గురించి చెప్పాలంటే....ఫస్టాఫ్ ఏమాయచేసావేలా ఉంటే...సెకండాఫ్ యాక్షన్ ఉంటుంది. అందరికి నచ్చుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments