ఢిల్లీలో అసలేం జరుగుతోంది..? ఏంటీ అశ్లీల పాంప్లెట్స్ రచ్చ!
- IndiaGlitz, [Friday,May 10 2019]
భారతదేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అసలే ఎండాకాలం అంటే నేతల మాటల తూటాలతో మరింత రాజకీయం వేడెక్కింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో మొదలైన ఎన్నికలు విడతల వారిగా జరుగుతున్నాయ్.. మరో రెండు విడతల్లో ముగియనున్నాయి. ఢిల్లీ తూర్పు నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అయిన ఆప్ తరఫున అతిషీ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కాస్త అశ్లీల పాంప్లెట్స్ వరకూ చేరింది. అసలు ఈ పాంప్లెట్స్ ఎవరి కొట్టించారో కానీ ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి.
పాంప్లెట్స్‌లో ఏముంది..?
ఆప్ అభ్యర్థి అతిషీ మిక్స్‌డ్ బ్రీడ్ (చాలా మందికి పుట్టిన) కి ఉదాహరణ అనీ, బీఫ్ ఈటర్ (గొడ్డు మాంశం తినే వారు)ని పెళ్లి చేసుకున్నారనీ, ఆమెను వేశ్యగా అభివర్ణిస్తూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలు ఆ పాంప్లెట్లలో ఉన్నాయి. అతిషీ త్వరలో శిశోడియా కొడుక్కి పిల్లాణ్ని కనిపెడతారు అని తీవ్రమైన కామెంట్లు కూడా అందులో ఉండటం గమనార్హం.
అతిషీ కంటతడి..!
ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తించిన మీరు.. ఇక లక్షలాది స్త్రీలకు ఎలా రక్షణ కల్పిస్తారు..? అని గంభీర్‌నిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతున్నంత సేపు ఆమె ఏడ్చేశారు. ఇలాంటి పాంప్లెట్లు పంచుతూ గంభీర్ ఏ స్థాయికి దిగజారిపోయాడో చూడండి అంటూ మండిపడ్డారు.
గంబీర్ స్పందన..
మీరు నిజాలే మాట్లాడి ఉంటే చట్టబద్ధంగా పోరాడండి. నాకు వ్యతిరేకంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే కేసు పెట్టండి. కోర్టులోనే వాటికి సమాధానం చెబుతా. నాపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటాను. ఆధారాలు లేకుండా ఆరోపణలు చెయ్యడం తగదు. ఇప్పటివరకూ ఎన్నికల ప్రచారంలో నేను ఎవరికీ వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లూ చెయ్యలేదు అని గంబీర్ చాలెంజ్ చేశారు.
పరువు నష్టం దావా..
ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియాకు గౌతం గంభీర్ పరువు నష్టం దావా నోటీస్ పంపారు. ఆప్‌పై తాడోపేడో తేల్చుకునేందుకు గంభీర్ సిద్ధమయ్యాడని చెప్పుకోవచ్చు. గంబీర్ అలాంటి వ్యక్తి కాదని పలువురు బీజేపీ నేతలు, క్రికెటర్స్ ఆయన మద్దతు పలుకుతున్నారు. అయితే పరువు నష్టం దావా నోటీసులపై ఆప్ నేతల నుంచి ఎలా రియాక్షన్ ఉంటుంది..? మే-12న జరగబోయే ఎన్నికలు ఎలా ఉంటాయి..? మే-23న ఢిల్లీ తూర్పు పీఠం కూర్చునేదెవరు..? అనే విషయం తేలాలంటే మరికొన్నిరోజులు వేచి చూడాల్సిందే మరి.