ఊపిరి కి ఇన్ టచ్ బుల్స్ నిర్మాత అభినందన
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున - కార్తీ - తమన్నా కలిసి నటించిన ఊపిరి చిత్రం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ తో బ్లాక్ బష్టర్ దిశగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఊపిరి సినిమా ఇన్ టచ్ బుల్స్ అనే ఫ్రెంచ్ మూవీకి అఫిషియల్ రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇన్ టచ్ బుల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ గమోంట్ ఊపిరి చిత్రాన్ని ప్రశంసించడం విశేషం. ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ గమోంట్. ఈ సంస్థ నిర్మించిన ఇన్ టచ్ బుల్స్ మూవీ ఆల్ టైమ్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
ఇన్ టచ్ బుల్స్ నిర్మాణ సంస్థ ఊపిరి చిత్రం గురించి స్పందిస్తూ...మా సంస్థ నుంచి ఫస్ట్ ఇండియన్ రీమేక్, అలాగే ఇన్ టచ్ బుల్స్ సినిమాకి కూడా ఫస్ట్ ఇండియన్ రీమేక్ ఊపిరి చిత్రం కావడం సంతోషంగా ఉంది. ఇంత తక్కువ టైమ్ లోనే మంచి క్వాలిటీతో ఊపిరి చిత్రాన్ని నిర్మించిన పి.వి.పి ని అభినందిస్తున్నాం అంటూ తమ సంతోషాన్ని పంచుకుంది ఫ్రెంచ్ ఇన్ టచ్ బుల్ నిర్మాణ సంస్థ గమోంట్. ఒక తెలుగు సినిమా గురించి ఫ్రెంచ్ నిర్మాణ సంస్థ మాట్లాడడం అంటే నిజంగా గ్రేట్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com