గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి - 2 మిలియ‌న్ హిట్స్..!

  • IndiaGlitz, [Saturday,October 15 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి టీజ‌ర్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. గౌత‌మీ బాల‌శ్రీ పాత్రధారి హేమ‌మాలిని చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజ‌ర్ మూడు రోజుల్లోనే 2 మిలియ‌న్ హిట్స్ సాధించ‌డం విశేషం. ఈ టీజ‌ర్ కు 3 రోజుల్లో 2 మిలియ‌న్ వ్యూస్ రావ‌డంతో టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో బాల‌కృష్ణ స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసారు.

అలాగే ఈ టీజ‌ర్ కు 25కె లైక్స్ రావ‌డం మ‌రో విశేషం. 2 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేయ‌డంతో డైరెక్ట‌ర్ క్రిష్, ప్రొడ్యూస‌ర్ వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాబాబు తెలుగు ఆడియోన్స్ కు థ్యాంక్స్ తెలియ‌చేసారు. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణ - బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్ట‌ర్ - భూపేష్ భూప‌తి, కెమెరామెన్ - జ్ణాన‌శేఖ‌ర్, సంగీతం - చిరంత‌న్ భ‌ట్, లిరిక్స్ - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, డైలాగ్స్ - బుర్రా సాయిమాధ‌వ్, ఫైట్స్ - రామ్ ల‌క్ష్మ‌ణ్, కో-ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, ప్రొడ్యూస‌ర్స్ - వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాబాబు, డైరెక్ట‌ర్ - క్రిష్