విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది. ఆ రసాయనాల వాసనకి కళ్ళు మంట, కడుపులో వికారంతో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కొందరికీ ఒళ్లు దురదలు కూడా పుట్టాయ్.సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్జీ పాలిమర్స్, ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మేఘాద్రి గడ్డ వైపు కూడా ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరికొందరు సింహాచలం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించేందుకు భారీగా అంబులెన్స్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత
వైపు కెమికల్ పీల్చిన జనాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద అలానే పడిపోతున్నారు. మొత్తం మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయివు వ్యాపించేసింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. అందులో ఓ చిన్నారి కూడా ఉండటం బాధాకరమైన విషయం. చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. పాలిమర్స్ బాధితులతో కేజీహెచ్ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
కళ్లు కనిపించక..
విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఒకరు మృతి చెందారు. వెంకటాపురంలో పెద్దఎత్తున పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. చెట్లు అయితే మాడిపోవడం గమనార్హం. కాగా ఘటనాస్థలికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటనను పరిశీలించడానికి జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, డీసీపీ ఉదయ్‌భాస్కర్ సందర్శించారు. అయితే రసాయనాలు థాటికి ఉదయ్ భాస్కర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
అసలేం జరిగింది..!?
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చందన్ మీడియాతో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో 2 గంటలు పట్టొచ్చని తెలిపారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురై ఉంటారన్నారు. యంత్రాలను ప్రారంభించే సమయంలో మంటలు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 20 మందికి పైగా మృతి చెందారని.. ఈ ఘటన 5:45 గంటల ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. క్షణాల్లోనే 7 కిలోమీటర్ల మేర రసాయనాలు వ్యాపించేశాయని సమాచారం. ప్రస్తుతం పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని.. ఇది చాలా డేంజర్ పరిస్థితి అని తెలియవచ్చింది. ఇది మానవ తప్పిదమే అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? ఏంటి..? అనే విషయాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com