చైతన్య,రానాతో గరుడవేగ దర్శకుడి చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకులు నాగచైతన్య, రానా.. త్వరలోనే ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారా? అవుననే వినిపిస్తోంది.. టాలీవుడ్ సర్కిల్స్‌లో. గతంలోనే వీరిద్దరూ సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇటీవల పి.ఎస్.వి.గరుడ వేగ` వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు.. ఒక కథను ఈ ఇద్దరు యంగ్ హీరోలకి చెప్పారు.
అది ఎంతో ఆసక్తిగానూ, ఆకట్టుకునే విధంగానూ ఉండడంతో వీరిద్దరూ ఓకే చేసారని సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది. ప్రస్తుతం రానా 'హాథీ మేరే సాథీ' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.
అలాగే చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సవ్యసాచి', మారుతి డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న 'శైలజారెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలతో చైతు బిజీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com