5 రోజుల్లో రూ.15 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టుకున్న'పిఎస్వి గరుడవేగ'
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన డా.రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్‌గా నటించిన చిత్రం 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం'. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బేనర్‌పై ఎం.కోటేశ్వర్ రాజు నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ని తెచ్చుకుంది. అంతేకాకుండా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రెండో వారంలో దిగ్విజయంగా అడుగుపెడుతోంది.
ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాత ఎం.కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం' సెన్సేషనల్ హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మించుతూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
డా.రాజశేఖర్ గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ప్రవీణ్ సత్తారు గారి ఎక్స్ ట్రార్డనరీ టేకింగ్, సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ఐదు రోజుల్లో రూ.15 కోట్లకిపైగా వసూళ్ళను రాబట్టుకున్న మా సినిమా.. రెండో వారంలోకి అడుగుపెడుతున్నప్పటికీ ఆదరణ అంతకు అంతగా పెరుగుతోంది.
రెండో వారంలో కూడా థియేటర్ల సంఖ్య పెరగడమే సినిమాకి పెరుగుతున్న ఆదరణకు సాక్ష్యం. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు" అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments