చాగంటితో వివాదాలపై క్లారిటీ ఇచ్చుకున్న గరికపాటి!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో భక్తజన అభిమానాన్ని పొందిన ఆధ్యాత్మిక వేత్తలు, ప్రవచన కర్తల్లో మొదట గుర్తొచ్చేది చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు. అయితే వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవని ప్రచారం ఎప్పట్నుంచో ఉందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నప్పటికీ భక్తులు, అభిమానుల్లో మాత్రం సందేహాలకు ఫుల్‌స్టాప్ పడలేదు. అంతేకాదు.. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇప్పటికే ఇరువురూ క్లారిటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తాజాగా గరికపాటి మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చారు.
నాకు ఎలాంటి వివాదాల్లేవ్..!
‘చాగంటితో నాకు ఎలాంటి వివాదాలు లేవు. చాగంటి ధర్మరాజు అయితే నేను అర్జునుణ్ని. అర్జునుడు ఎంత వీరుడైనా చక్రవర్తి ధర్మరాజే. తెలుగునాట ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియడంలో చాగంటిదే కీలకపాత్ర. ప్రవచన చక్రవర్తి చాగంటే.. నేను ప్రవచన కిరీటినే. తెలుగునాట ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియడంలో చాగంటి కోటేశ్వరరావుదే కీలకపాత్ర. ప్రవచనాలు చెప్పడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో విధానం. చాగంటివారిది రక్తి కట్టించే విధానం. నాది రక్తం ఉప్పొంగించే విధానం. సమాజానికి రెండూ అవసరమే. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఇద్దరూ మహర్షులే. ఇద్దరూ బ్రహ్మర్షులే’ అని పోలికలు చెప్పి మరీ నిశితంగా వివరించి అనుమానాలు పటాపంచ్‌లు చేశారు. అంతేకాదు తనది.. విశ్వామిత్ర గోత్రమని.. చాగంటి వారిది వశిష్ఠ గోత్రమని ఇద్దరికీ కొంచెం తేడా ఉంటుందని గరికపాటి చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే వివాదాలపై గరికపాటి అయితే క్లారిటీ ఇచ్చేశారు. ఇక మిగిలిందల్లా చాగంటి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరి ఆయన ఎప్పుడు క్లారిటీ ఇచ్చి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడతారా..? అని ఆయన అభిమానులు, భక్తులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. కాగా.. ఇటీవల జరిగిన ‘శారదా జ్ఞాన పుత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరణలో చాగంటికి ‘ధార్మికవరేణ్య’ అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout