ఆది గరం లోగో లాంఛ్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది, ఆదా శర్మ జంటగా మదన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గరం. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సాయి స్ర్కీన్స్ పతాకం పై పి సురేఖ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను, మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో లాంఛ్ చేసారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ..మా సంస్థలో వస్తున్న మొదటి చిత్రం గరం. ఆది నటిస్తున్న 7వ సినిమా ఇది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా పూర్తి చేసాం.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేయనున్నాం అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ..కథ విని ఈ సినిమాను మనమే సొంతంగా చేద్దమని నాన్నకు చెప్పాను. నాన్న కూడా కథ విని ఓకె అన్నారు. ప్రొడ్యూసర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదు. మదన్ సెన్సిబుల్ డైరెక్టర్. ఈ సినిమాలోఉండే ఎమోషన్ అందరికీ రీచ్ అవుతుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments