గ్యారేజ్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్..
- IndiaGlitz, [Tuesday,February 02 2016]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు ఈ రెండు చిత్రాలకు యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పుడు కొరటాల శివ జనతా గ్యారేజ్ కి కూడా దేవిశ్రీప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నారు.
ప్రస్తుతం దేవిశ్రీ జనతా గ్యారేజ్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ట్విట్టర్ లో ...జనతా గ్యారేజ్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసాను. మరోసారి ఎన్టీఆర్ కి, కొరటాల శివ కి మ్యూజిక్ అందిస్తుండడం చాలా ఎగ్జైట్ గా ఉంది. జనతా గ్యారేజ్ రాకింగ్ స్ర్కిప్ట్ అంటూ స్పందించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈనెల 10 నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు.