భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అలియాస్ బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే. బీసీసీఐ అధ్యక్షుడి కోసం జరిగిన ఎన్నికల్లో కేవలం గంగూలీ ఒక్కడే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. బుధవారం నాడు బీసీసీఐ కార్యాలయంలో దాదా బాధ్యతలు స్వీకరించారు.
గంగూలితో పాటు వీళ్లు కూడా..!
సెక్రటరీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా
కోశాధికారి: మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ సింగ్ ధుమాల్
ఉపాధ్యక్షుడు: మాహిమ్ వర్మ
జాయింట్ సెక్రటరీ : కేరళకు చెందిన జయేష్ జార్జ్
రేపు కొహ్లీతో భేటీ!
ఈ సందర్భంగా అధ్యక్ష హోదాలో మీడియాతో మాట్లాడిన గంగూలి.. కోహ్లీతో రేపు అనగా గురువారం సమావేశమవుతానని చెప్పారు. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కోహ్లినే అని.. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించారన్నారు. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లి తాపత్రయమన్నారు. ఐసీసీ నుంచి భారత్‌కు రావాల్సిన బకాయిలను రాబడతామని గంగూలీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే రేపు జరగనున్న భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.