పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. కాగా.. ప్రాణాలు కోల్పోయిన వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వికాస్ దుబే 60 క్రిమినల్ కేసులతో పాటు హత్యాయత్నం సహా వివిధ నేరాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో వికాస్ దూబేను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసు శాఖ 25కు పైగా బృందాలను రంగంలోకి దింపింది.

ఈ బృందాలు ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టినట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. అలాగే దూబేను పట్టుకునేందుకు యూపీలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మరోవైపు సర్వైలెన్స్ బృందం ఫోన్ల స్కానింగ్ ద్వారా దూబే జాడ పసిగట్టేందుకు యత్నిస్తోంది. అయితే దూబే సమాచారం అందించిన వారికి రూ.50 వేలు నగదు బహుమతిని అందిస్తామని ఐజీ అగర్వాల్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి విరాలను గోప్యంగా ఉంచుతామని కూడా ఆయన వెల్లడించారు.

More News

అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో

ఏపీ కరోనా బులిటెన్ విడుదల..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు ఏపీలో మొత్తంగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా?

‘ఆమె కథ’.. మొన్న నవ్యకు.. నేడు రవికృష్ణకూ కరోనా..

ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బుల్లితెర షూటింగ్‌లు నిర్వహిస్తోంది. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నప్పటికీ పలువురు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమక్రమంగా అది అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి కూడా కరోనా వ్యాపించింది.