పోలీసులపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు.. 8 మంది పోలీసులు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడటంతో 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు గాయపడ్డారు. కాగా.. ప్రాణాలు కోల్పోయిన వారిలో డిప్యూటీ సూపరింటెండెంట్, ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. వికాస్ దుబే 60 క్రిమినల్ కేసులతో పాటు హత్యాయత్నం సహా వివిధ నేరాలలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో వికాస్ దూబేను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసు శాఖ 25కు పైగా బృందాలను రంగంలోకి దింపింది.
ఈ బృందాలు ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం గాలింపు చర్యలు చేపట్టినట్టు కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. అలాగే దూబేను పట్టుకునేందుకు యూపీలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. మరోవైపు సర్వైలెన్స్ బృందం ఫోన్ల స్కానింగ్ ద్వారా దూబే జాడ పసిగట్టేందుకు యత్నిస్తోంది. అయితే దూబే సమాచారం అందించిన వారికి రూ.50 వేలు నగదు బహుమతిని అందిస్తామని ఐజీ అగర్వాల్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి విరాలను గోప్యంగా ఉంచుతామని కూడా ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout