లారెన్స్ గంగ సీక్వెల్ టైటిల్ ఇదే

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ ముని, కాంచ‌న‌, గంగ టైటిల్స్ తో సినిమాలు తీసి అటు త‌మిళ్ లోను, ఇటు తెలుగులోను ఘ‌న విజయాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు గంగ సినిమాకి సీక్వెల్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త‌మిళ్ లో గంగ సీక్వెల్ ను నాగ టైటిల్ తో రూపొందిస్తున్నాడు. తెలుగులో గంగ సీక్వెల్ కు భైర‌వ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం

అయితే గంగ సినిమాలో లారెన్స్ గుండు శివ గా న‌టించాడు. గంగ సీక్వెల్ కి గుండు శివ అనే టైటిల్ పెడ‌తార‌నుకున్నారు. కానీ తాజాగా భైర‌వ టైటిల్ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇదిలా ఉంటే...ముని, కాంచ‌న‌, గంగ‌..సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో గంగ సీక్వెల్ తెలుగు వెర్ష‌న్ కి 20 కోట్లు పైగా చెబుతున్నాడ‌ట లారెన్స్. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో 20 కోట్లుకు పైగా ఇవ్వ‌డానికి ఓ నిర్మాత అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.