Download App

Gang Review

గ‌జిని, సింగం సీక్వెల్స్ చిత్రాల‌తో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య‌. సీరియ‌స్ పాత్ర‌ల‌తో మెప్పిస్తూ వ‌చ్చిన సూర్య కాస్త స్టైల్ మార్చి స‌ర‌దాగా సాగా పాత్రలో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ సినిమాయే `గ్యాంగ్‌`.  విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద కూట్టమ్‌ను తెలుగులో గ్యాంగ్ పేరుతో విడుద‌ల చేశారు. నిజ ఘ‌ట‌న ఆధారంగా హిందీలో రూపొందిన `స్పెష‌ల్ 26`కి ఇది రీమేక్‌. అయితే ద‌ర్శ‌కుడు సినిమాను అలాగే తెర‌కెక్కించాడా?  లేదా మార్పులేమైనా చేశాడా? అస‌లు ఈ గ్యాంగ్ ప్రేక్ష‌క్ష‌కులు ఎంత మేర ఆక‌ట్టుకుంద‌ని తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ :

అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ తిల‌క్‌(సూర్య‌)  అత‌ని స్నేహితుడికి ఉద్యోగాలు రావు. ఒత్తిడిలో తిల‌క్ స్నేహితుడు ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దాంతోపాటు తిల‌క్ సీబీఐ ఆఫీస‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. ఇంట‌ర్వ్యూలో అత‌నికి నిరాశే ఎదుర‌వుతుంది. అవినీతి ప‌రుడైన ఆఫీస‌ర్ కార‌ణంగా తిల‌క్‌కు ఉద్యోగం రాదు. దాంతో తిల‌క్‌కి కోపం వ‌చ్చి.. బుజ్జ‌మ్మ‌( ర‌మ్య‌కృష్ణ‌), సెంథిల్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ త‌దిత‌రులతో క‌లిసి పెద్ద ధ‌న‌వంతుల ఇళ్ల‌ను కొల్ల‌గొట్ట‌డానికి ప్లాన్ చేసుకుంటాడు. అందులో భాగంగా అంద‌రూ తాము సీబీఐ ఆఫీస‌ర్స అని చెప్పి..ధ‌న‌వంతులు, రాజ‌కీయ నాయ‌కుల ఇళ్ల‌పై రైడ్స్ చేసి డ‌బ్బును కొల్ల‌గొట్టేస్తారు. అస‌లు విష‌యం తెలిసి సీబీఐ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగుతుంది. ప్ర‌భుత్వం నియ‌మించిన స్పెష‌ల్ ఆఫీస‌ర్ శివ‌శంక‌ర్ (కార్తీక్‌) తిల‌క్ అండ్ గ్యాంగ్ చేసే ప‌నులను తెలుసుకుంటాడు? మ‌రి తిల‌క్ అండ్ గ్యాంగ్‌ను శివ‌శంక‌ర్ ప‌ట్టుకున్నాడా? అస‌లు తిల‌న్ కొల్ల‌గొట్టిన డ‌బ్బుతో ఏం చేశాడు? అనే విష‌యాలు తెలుసుకోవాంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:

- న‌టీనటులు
- సినిమాటోగ్ర‌ఫీ
- సంగీతం
- కొన్ని స‌న్నివేశాలు తెరెక్కించిన‌ తీరు
- ఎమోష‌న‌ల్ సీన్స్‌

మైన‌స్ పాయింట్స్‌:

- క‌థ‌నం ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉంటే బావుండేది.
- సినిమాలో ఓ సీరియ‌స్ నెస్ క‌న‌ప‌డ‌దు.

విశ్లేష‌ణ:

నిరుద్యోగ యువ‌కుడిగా, న‌కిలీ సీబీఐ ఆఫీస‌ర్‌గా సూర్య రెండు షేడ్స్‌ను చ‌క్క‌గా పోషించాడు. సూర్య పాత్ర‌లో ఓ కామెడీ పించ్ సినిమా ఆసాంతం క‌న‌ప‌డ‌తుంది. తొలిసారి త‌న పాత్ర‌కు సూర్య డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవడం విశేషం. గ‌జిని సినిమాల‌కు ముందు సూర్య త‌మిళంలో న‌టించిన జోష్‌తో కూడిన పాత్ర‌నే ఈ సినిమాలో మ‌రోసారి చేసిన‌ట్టు అనిపించింది. సూర్య ఇలా కొత్త‌గా క‌న‌ప‌డ‌టం తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్త ట‌చ్ ఇచ్చిన‌ట్లే. సూర్య క్యారెక్ట‌ర్‌లో మంచి ఇన్టెన్సిటీ, క్లారిటీతో ఉండేలా డిజైన్ చేశారు. దాన్ని సూర్య క్యారీ చేసిన తీరు బావుంది.  ఇక హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. అయితే ఉన్నంతలో ఆమె పాత్ర‌కు న్యాయం చేసింది. ఆమెకు, సూర్యకు మ‌ధ్య ఉన్న ల‌వ్ కాస్త కామెడీ ట‌చ్‌తో సాగుతుంది.  బుజ్జ‌మ్మ అలియాస్ ఝాన్సీ రాణిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌, ఎడెనిమిది మంది పిల్ల‌ల త‌ల్లిగా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. ఒక‌వైపు న‌కిలి సీబీఐ ఆఫీస‌ర్‌గా కూడా క‌నిపిస్తున్నంతసేపు ఆమె పాత్ర‌లో హుందాత‌నం క‌న‌ప‌డుతుంది. గ్యాంగ్‌ను ప‌ట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్‌గా సీనియ‌ర్ న‌టుడు కార్తీక్ న‌ట‌న బావుంది. హీరో త‌న టీంతో క‌లిసి ఇత‌రుల‌ను మోసం చేసే స‌న్నివేశాలు, వాటి చిత్రీక‌ర‌ణ‌, కార్తీక్ పాత్ర చిత్రీక‌ర‌ణ అన్ని చ‌క్క‌గా ఉంటాయి.  మిగిలిన పాత్ర‌ధారులు సెంథిల్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌, తంబిరామ‌య్య‌, క‌లైర‌స‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ క‌థ‌ను రాసుకోవ‌డానికి పెద్ద‌గా ఇబ్బంది ప‌డిఉండ‌క‌పోవ‌చ్చు. హీరోకు, అత‌ని స్నేహితుడికి, తండ్రికి మ‌ధ్య ఉండే ఎమోష‌న్స్ ప్రేక్ష‌కుల‌కు మెప్పిస్తుంది. హీరో ఇంట‌ర్వ్యూ నుండి వ‌చ్చిన త‌ర్వాత తండ్రి మాట్లాడే స‌న్నివేశం, హీరో స్నేహితుడు అత‌ని క‌ళ్ల ముందే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ప్పుడు అత‌ను ప‌డే బాధ ఇవ‌న్నీ ఆడియెన్స్ మెప్పిస్తాయి. ఆ విష‌యంలో 1987లో మ‌న ద‌గ్గ‌ర ఉన్న నిరుద్యోగ స‌మ‌స్య అనే పాయింట్‌ను క‌థ‌కు లింక్ పెడుతూ బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌. అయితే కథనం ఇంకా గ్రిప్పింగ్ ఉంటే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. క‌థ‌లో త‌మిళ నేటివిటీ ఉన్నా తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎలెమెంట్స్ బాగానే ఉన్నాయి. అనిరుధ్ సంగీతం, నేప‌థ్య సంగీతం పర్వాలేదు.దినేష్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది.  నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బాట‌మ్ లైన్: సందడి చేసే గ్యాంగ్

Ganga Movie Review in English

Rating : 3.0 / 5.0