pawan kalyan : ఇల్లు, కార్యాలయం.. నీడలా వెంటాడుతున్న ఆగంతకులు, పవన్ హత్యకు కుట్ర ..?
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌కు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశాలు వున్నాయా అంటూ అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అనేక వరుస సంఘటనలు జరుగుతున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం పవన్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని.. పవన్‌ను వెంటాడుతున్న వారు ఆయన అభిమానులు కాదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
విశాఖలోనే పవన్‌పై దాడికి స్కెచ్ :
పవన్‌పై దాడికి కుట్ర జరుగుతోందని కేంద్రం నుంచి తమకు స్పష్టమైన సమాచారం వుందని ఆయన తెలిపారు. విశాఖలోనే దీనిని అమలు చేయాలని అనుకున్నారని, కానీ లక్షలాది మంది అభిమానులు వుండటంతో వారి పథకం అమలు చేయడం వీలు కాలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ ఇల్లు, కార్యాలయాల వద్ద అనుమానితుల కదలికలు వున్నాయని ఆయన ఓ లేఖలో తెలిపారు.
పవన్ భద్రతా సిబ్బందితో కొందరి ఘర్షణ:
రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆయన భద్రతా సిబ్బందితో గొడవకు దిగిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు కారులో పవన్ ఇంటి సమీపానికి వచ్చారు. ఈ సందర్భంగా జనసేనానిని అసభ్యపదజాలంతో దూషించారు. దీనిని గమనించిన పవన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. వారు వినకపోగా.. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీనిపై పవన్ కల్యాణ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయనను హత్య చేయాలని చూస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో దీనిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments