pawan kalyan : ఇల్లు, కార్యాలయం.. నీడలా వెంటాడుతున్న ఆగంతకులు, పవన్ హత్యకు కుట్ర ..?

  • IndiaGlitz, [Thursday,November 03 2022]

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌కు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశాలు వున్నాయా అంటూ అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి అనేక వరుస సంఘటనలు జరుగుతున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం పవన్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని.. పవన్‌ను వెంటాడుతున్న వారు ఆయన అభిమానులు కాదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

విశాఖలోనే పవన్‌పై దాడికి స్కెచ్ :

పవన్‌పై దాడికి కుట్ర జరుగుతోందని కేంద్రం నుంచి తమకు స్పష్టమైన సమాచారం వుందని ఆయన తెలిపారు. విశాఖలోనే దీనిని అమలు చేయాలని అనుకున్నారని, కానీ లక్షలాది మంది అభిమానులు వుండటంతో వారి పథకం అమలు చేయడం వీలు కాలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ ఇల్లు, కార్యాలయాల వద్ద అనుమానితుల కదలికలు వున్నాయని ఆయన ఓ లేఖలో తెలిపారు.

పవన్ భద్రతా సిబ్బందితో కొందరి ఘర్షణ:

రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆయన భద్రతా సిబ్బందితో గొడవకు దిగిన ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు కారులో పవన్ ఇంటి సమీపానికి వచ్చారు. ఈ సందర్భంగా జనసేనానిని అసభ్యపదజాలంతో దూషించారు. దీనిని గమనించిన పవన్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. వారు వినకపోగా.. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీనిపై పవన్ కల్యాణ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్‌ కళ్యాణ్‌ని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయనను హత్య చేయాలని చూస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్నారు. రానున్న రోజుల్లో దీనిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.

More News

BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘బెడ్ రూమ్’’ కామెంట్స్...ఇనయాపై శ్రీహాన్- శ్రీసత్య ఫైర్, ఆదికి సీక్రెట్ టాస్క్

బిగ్‌బాస్‌లో ఇంట్రెస్టింగ్ టాస్క్‌లతో ఆడియన్స్‌కి అసలు సిసలు మజాను పంచుతున్నారు నిర్వాహకులు.

Matti Kusti: విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' ఫస్ట్ లుక్‌

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'.

బాత్రూమ్‌ తలుపేసుకున్న ఇనయా.. బద్ధలుకొట్టబోయిన రేవంత్ , గీతూపై బాలాదిత్య ఫైర్

రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది.

In Secure: నవంబర్ 11న ''ఇన్ సేక్యూర్" విడుదల

ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో సిహెచ్  క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ )

BiggBoss: నామినేషన్స్‌లో 10 మంది... ఇనయాను ఆడుకున్న ఆదిరెడ్డి

బిగ్‌బాస్ 6 తెలుగులో ఆదివారం ఎలాంటి ఎలిమినేషన్ లేకపోవడంతో జనాలు కాస్త డీలా పడ్డారు.