భారత్ వరల్డ్ రికార్డ్స్ లో గణేష్ మాస్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డ్ గ్రహీత, భారత్ ఆర్ట్స్ అకాడెమీ ద్వారా గబ్బర్ సింగ్ అవార్డును గణేష్ మాస్టరు అందుకొన్నారు. సినీ కొరియోగ్రాఫర్ గా పలువురు స్టార్ హీరోలు .. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ యన్ టి ఆర్, రామ్, నితిన్, మంచు విష్ణు, అల్లరి నరేష్, నారా రోహిత్, నిఖిల్, ఆది, వరుణ్ సందేశ్, జగపతి బాబు, కళ్యాణ్ రామ్ తదితర హీరోలతో పని చేసారు.
ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారి ఆసీస్సులతొ ఒసెయ్ రాములమ్మా చిత్రంతొ కొరియోగ్రాఫర్ గా పరిచయం అయ్యారు తర్వాత సుకుమార్, త్రివిక్రమ్,హరీష్ శంకర్, గుణశేఖర్, వి వి వినాయక్, పూరి జగన్నాథ్ , కరుణాకరన్ , నాగేశ్వరరెడ్డి, సీనియర్ దర్శకులు ఈవివి సత్యనారాయణ వంటి దర్శకుల దగ్గర పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసారు.
తాజాగా భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతి ఏడాది అందించే బెస్ట్ టాలెంటెడ్ అవార్డ్ 2016-2017 కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ''గబ్బర్ సింగ్'' గణేష్ మాస్టారు కు దక్కింది.
సినీ మరియు టీవీ రంగాలలో అయన చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణా రాష్ట్రం తరపున గణేష్ మాస్టర్ కు బెస్ట్ టాలెంటెడ్ అవార్డు 2016-2017 ను మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి.రోశయ్య, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి లయన్ డా..కె వి రమణారావు గార్ల చేతులమీదుగా నమోదు పత్రాన్నిఅందజేసారు. ఈ సందర్బంగా ఈ అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని గణేష్ మాస్టర్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments