గాంధీ ముని మనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.3 కోట్ల చీటింగ్ చేసి..
Send us your feedback to audioarticles@vaarta.com
జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె చేసిన ఘరానా చీటింగ్ కేసు నిరూపితం కావడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. 2015లోనే లతా రాంగోబిన్ పై సౌత్ ఆఫ్రికాలో కేసు నమోదైంది. కానీ అప్పట్లో ఆమె బెయిలుపై బయటకు వచ్చింది.
మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ కుమార్తె ఈ లతా రాంగోబిన్. దక్షిణాఫ్రికాలోని న్యూ ఆఫ్రికా అలియన్స్ అనే వస్త్రాలు, చెప్పులు వ్యాపారం చేసే కంపెనీని మోసం చేయడానికి ప్రయత్నించిన లతా ఈ చిక్కుల్లో చిక్కుకుంది. సదరు కంపెనీ ప్రాఫిట్ షేర్ ఒప్పందంలో ఇతరులకు రుణాలు కూడా ఇస్తూ ఉంటుంది.
ఆ కంపెనీ డైరెక్టర్ ఎస్ ఆర్ మహారాజ్ ని 2015లో లతా కలిశారు. తాను ఇండియా నుంచి మూడు లినెన్ కంటైనర్లు దిగుమతి చేసుకున్నానని మహారాజ్ కు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేకపోతున్నట్లు తెలిపింది. తనకు డబ్బు సాయం చేస్తే కంటైనర్లు హార్బర్ నుంచి తీసుకువచ్చి లాభాల్లో షేర్ ఇస్తానని తెలిపింది.
తాను లినెన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినట్లు పత్రాలు కూడా చూపించింది. దీనితో సదరు కంపెనీ ఆమెకు రూ 3.22 కోట్ల వరకు సాయం చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె చూపించిన పత్రాలు నకిలీవి అని, ఆమె ఇండియా నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని తేలింది. దీనితో మహారాజ్ పోలీసులని ఆశ్రయించి ఆమెపై కేసు నమోదు చేయించాడు.
ఆమె చేసిన మోసం తేలడంతో కోర్టు నేడు తుదితీర్పు ఇస్తూ ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పుపై ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com