సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ' పాటల విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పాటలు ట్రెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.
అక్టోబర్ 5 న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత లయన్ సాయి వెంకట్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జె.వి.మోహన్ గౌడ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. హీరోయిన్ రాధిక, దర్శకుడు సూరియన్, నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ, హీరోల్లో ఒకరైన పవన్ కుమార్, విలన్ పాత్రధారి రవికిరణ్ శొంఠి, లేడీ డైరెక్టర్ సుచరిత, ఆనంతలక్ష్మి, డి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటలతోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేసిన అనంతరం 'గందభేరుండ' ఘన విజయం సాధించాలని లయన్ సాయి వెంకట్, జె.వి.మోహన్ గౌడ్ ఆకాంక్షించారు. హీరోయిన్ గా పరిచయమవుతున్న రాధికకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు.
దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. 'గండ భేరుండ పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ 'గండభేరుండ' చిత్రాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది" అన్నారు.
నిర్మాత చల్లమళ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. "సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీసాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout