సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండ భేరుండ'

  • IndiaGlitz, [Monday,August 06 2018]

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తోపాటు సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

దర్శకుడు సూర్యన్ మాట్లాడుతూ.. 'గండ భేరుండ' పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్నిఅత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే ఇతివృత్తంతో రూపొందిన సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ 'గండభేరుండ'. మలేషియాలో చేయించిన 17 నిమిషాల నిడివి కల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు.

మా నిర్మాతలు కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ 'గండభేరుండ' చిత్రాన్నికాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. సెన్సార్ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

రవికిరణ్, సమ్మెట గాంధీ, విశ్వేశ్వరావు, జయవాణి, రాధ, శ్రీరంభ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కెమెరా: ఆనంద్, సంగీతం: శ్రీ సాయిదేవ్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాతలు: కె.సూరిబాబు-చల్లమళ్ళ రామకృష్ణ, రచన-దర్శకత్వం: కె.సూరిబాబు!

More News

మ‌హేశ్ టైటిల్ అదేనా?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 25వ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌, పివిపి సినిమా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఇష్టంగా' లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ "ఇష్టంగా".

త‌మ‌న్నా స్పెష‌ల్‌...

ఒక‌ప్పుడు స్పెష‌ల్ సాంగ్స్‌లో.. ఐటెమ్ సాంగ్స్‌లో న‌టించ‌డానికి ప్ర‌త్యేక న‌టీమ‌ణులుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

భారీ యక్షన్‌ స్ట్తెయిలిస్‌ ఫిల్మ్‌ 'రాణా అక్రమ్‌' 60 శాతం పూర్తి

అక్రమ్‌ సురేష్‌ హీరోగా మరియు దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని రాజధాని అమరావతి మూవీస్‌ సంస్థ నిర్మిస్తుంది.

ఆగస్టు 10న 'ఆమెకోరిక'

ఎస్‌.ఆర్‌.మీడియా సమర్పణలో యూట్యూబ్‌ స్పైసీ స్టార్‌ స్వాతినాయుడు నటించిన చిత్రం 'ఆమెకోరిక'. వల్లభనేని సురేష్‌ చౌదరి దర్శకత్వంలో చిక్కల  సత్యనారాయణ, ఎమ్‌.రత్నాకర్‌ సంయుక్తంగా నిర్మించారు.