Gamechanger:'గేమ్‌ఛేంజర్' మూవీ ఫస్ట్ సింగిల్ వాయిదా.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
RRR మూవీతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైన చిత్రీకరణ మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఓ వైపు కమల్ హాసన్ హీరోగా భారతీయుడు-2 మూవీతో శంకర్ బిజీగా ఉన్నాడు. దీంతో ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే చిత్ర షూటింగ్ మళ్లీ మొదలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో మూవీ అప్టేడ్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండుగకి ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. దాంతో దీని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
మూవీ మేకర్స్‌పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం..
అయితే తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ సింగిల్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడం లేదని పిఆర్ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. సంగీత దర్శకుడు తమన్ ఈ సాంగ్ ఫైనల్ మిక్సింగ్ చేయలేదట. తెలుగు వర్షన్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని కానీ హిందీ, తమిళ వెర్షన్ సాంగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో దసరాకి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడం లేదని ఫిల్మ్ నరగ్ వర్గాలు చెబుతున్నాయి. గత కొద్ది వారాలుగా 'భగవంత్ కేసరి' సినిమాపై తమన్ ఫోకస్ చేయడం వల్ల గేమ్ ఛేంజర్ సాంగ్ ఫైనల్ మిక్సింగ్ అవ్వకపోవడం దానికి కారణమని చెబుతున్నారు. దీంతో మెగా ఫాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతూ మూవీ మేకర్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తండ్రికొడుకుగా రామ్ చరణ్ ద్విపాత్రాభినయం..
పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర అని తెలుస్తోంది. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, అంజలి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు తమిళ నటుడు ఎస్ జె సూర్య, సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిల్ రాజుకు నిర్మాతగా 25వ చిత్రం కావడం విశేషం. వచ్చే ఏడాది వేసవిలో మూవీ విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments