Game Changer:మెగా ఫ్యాన్స్‌కు చెర్రీ బర్త్‌డే గిఫ్ట్.. 'గేమ్‌ఛేంజర్' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..
Send us your feedback to audioarticles@vaarta.com
దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టైటిల్ పోస్టర్ తప్ప ఏ అప్డేట్ రాలేదు. గతేడాది దసరా, దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయినా కానీ విడుదల చేయలేదు. అలాగే మూవీ షూటింగ్ కూడా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఎట్టకేలకు అభిమానులకు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ తీసుకొచ్చారు. మూవీలోని 'జరగండి' అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా.. డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాడారు. ఇక ప్రభుదేవా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ పాటలో చరణ్, కియారా తమ డ్యాన్స్‌తో అదుర్స్ అనిపించారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో అద్భుతమైన సెట్టింగ్స్‌తో గ్రాండ్‌గా ఈ సాంగ్ రూపొందించారు. దీంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది.
ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే 'రంగస్థలం' కాంబో రిపీట్ కానున్నట్లు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇదిలా ఉంటే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ ఓ మూవీలో చెర్రీ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో చరణ్ సరసన అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుంది.
మొత్తానికి RRR వంటి బ్లాక్బాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు చెర్రీ సినిమాలు థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి. రెండు సంవత్సరాల గ్యాప్‌లోనే ఈ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments