Game Changer:రికార్డు ధరకు అమ్ముడుపోయిన 'గేమ్ ఛేంజర్' మూవీ ఆడియో రైట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌ల(Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’(Game Changer). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత చరణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడై రికార్దు సృష్టించింది. ఈ సినిమా మ్యూజిక్ హక్కుల్ని ప్రముఖ ఆడియో కంపెనీ 'సరేగమ' రూ.33కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.
మూవీ నుంచి ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఇంత భారీ మొత్తంలో మ్యూజిక్ రైట్స్ అమ్ముడవడం రికార్డు అని చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి "జరగండి.. జరగండి.." లిరికల్ సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ పాట విజువల్స్, లిరిక్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటను దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని సమాచారం. సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. ఆ పాటల్లోని సెట్టింగ్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేసులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ఇక పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. "వినయ విధేయ రామ" సినిమా తర్వాత చెర్రీతో కియారా అడ్వాణీ మరోసారి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలో మూవీ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout