Game Changer:రికార్డు ధరకు అమ్ముడుపోయిన 'గేమ్‌ ఛేంజర్' మూవీ ఆడియో రైట్స్

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌ల(Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’(Game Changer). ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మీద దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడై రికార్దు సృష్టించింది. ఈ సినిమా మ్యూజిక్ హక్కుల్ని ప్రముఖ ఆడియో కంపెనీ 'సరేగమ' రూ.33కోట్లకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.

మూవీ నుంచి ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఇంత భారీ మొత్తంలో మ్యూజిక్ రైట్స్ అమ్ముడవడం రికార్డు అని చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి జరగండి.. జరగండి.. లిరికల్ సాంగ్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ పాట విజువల్స్, లిరిక్స్ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాటను దాదాపు రూ.20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారని సమాచారం. సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. ఆ పాటల్లోని సెట్టింగ్స్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేసులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ఇక పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ మూవీ సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత చెర్రీతో కియారా అడ్వాణీ మరోసారి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలో మూవీ విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

More News

KTR:ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు.

Samantha:అనారోగ్యం, విడాకులు.. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu:చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా వేసింది.

CM KCR:గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల అంఖం తుది దశకు చేరుకుంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.

Bigg Boss Telugu 7 : హగ్గులు, ముద్దులతో ప్రియాంకను ముంచెత్తిన ప్రియుడు.. కిచెన్‌కే అంకితమవుతావా హిత బోధ

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, వాగ్వాదాలకు బదులుగా ఈ వారం ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు నిర్వాహకులు. కుటుంబ సభ్యులను, మిత్రులను హౌస్‌లోకి పంపుతూ కంటెస్టెంట్స్‌‌ను ఖుషీ చేస్తున్నారు.