కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటిమి పై గంభీర్ ఎమోషనల్!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. అయితే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ తిలకించిన కోల్‌కతా జట్టు మాజీ కెప్టెన్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. రైడర్స్‌కు ఆయన తన మద్దతు తెలిపాడు. అంతటితో ఆగని ఆయన టీమ్‌కు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా గంభీర్ ఇలా రియాక్ట్ అయ్యారు.
గంభీర్ ట్వీట్ సారాంశం..
"హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఇలా ఓటమిపాలవ్వడం నన్ను బాధించింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో మంచి టాలెంట్ దాగుంది. కుర్రాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థులను మట్టికరిపించాలి. మొదట వీలైనంత త్వరగా జట్టులో కూర్పు చెయ్యండి.. మనం చెయ్యగలం.. కచ్చితంగా సాధిస్తాం" అంటూ టీమ్‌లో గౌతమ్ నూతనోత్సాహం నింపారు. కాగా కోల్‌కతా ఈ సీజన్లో మొదటి ఐదు మ్యాచుల్లో అన్నీ ఓడిపోయి ఆరోస్థానానికి పరిమితమైంది. గౌతమ్ ట్వీట్‌కు అభిమానులు, క్రీడా ప్రియులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు నాటి గౌతమ్ ఆటను గుర్తు తెచ్చుకుంటున్నారు.
అదృష్టం పరీక్షించుకుంటున్న గంభీర్!
ఇదిలా ఉంటే.. 2018 డిసెంబర్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గంభీర్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తూర్పు నుంచి బీజేపీ తరఫున గంభీర్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని పేరుంది. అయితే ఫస్ట్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న గౌతమ్‌కు విజయం వరించాలని క్రీడాభిమానులు, మిత్రులు కోరుకుంటున్నారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అరవిందర్ లవ్లీ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com