టర్కీ రీమేక్‌లో గల్లా వారసుడు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలకు.. రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుండి కొందరు రాజకీయాల్లోకి వెళుతుంటే.. ఆల్‌రెడీ రాజకీయాల్లో ఉన్న కొందరు వారి వారసులను హీరోలుగా సినిమాల్లో నటింప చేసే ప్రయుత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మినిష్టర్ గంటా శ్రీనివాస్ తనయుడు గంటా రవి.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఇలా ఎంతో మంది రాజకీయ నాయుకుల తనయులు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరో రాజకీయ నాయుకుడి తనయుడు సినీ రంగ ప్రవేశం చేయునున్నారు.
వివరాల్లోకెళ్తే.. గుంటూరు పార్లమెంట్ సభ్యుడు.. హీరో మహేశ్ బావ అయిన గల్లా జయుదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ‘ఆడువుగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాను దిల్‌రాజు నిర్మించబోతున్నాడని సమాచారం. మరో ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే గల్లా అశోక్ చేయనున్న ఈ సినిమా `లవ్స్ లవ్స్ కో ఇన్‌సిడెన్‌సెస్` అనే టర్కీ సినిమాకు రీమేక్ అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com