బంజారాహిల్స్ రేవ్ పార్టీ.. ఆ పబ్‌లో గల్లా అశోక్ లేడు : గల్లా ఫ్యామిలీ స్టేట్మెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వీరిలో టీడీపీ ఎంపీ, అమర్‌రాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ కుమారుడు, సినీ నటుడు గల్లా అశోక్ కూడా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై గల్లా కుటుంబ సభ్యులు స్పందించారు. పబ్ వ్యవహారంలో గల్లా అశోక్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దయచేసి అలాంటి నిరాధారమైన వార్తలని మీడియాలో ప్రసారం చేయకూడదని గల్లా ఫ్యామిలీ కోరింది.
కాగా.. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో పుడింగ్ మిగ్ పబ్‌పై నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై మెరుపుదాడి చేశారు. అనంతరం పబ్ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో బిగ్‌బాస్ విన్నర్, ప్రముఖ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా వున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్‌ఎస్‌డీతో ఉన్న సిగరెట్లు కనిపించాయి. పోలీసులను చూసిన యువతీ యువకులు డ్రగ్స్ ప్యాకెట్లను ఎక్కడపడితే అక్కడ పడేశారు. బాత్ రూమ్, డ్యాన్స్ ఫ్లోర్లలోనూ డ్రగ్స్ ప్యాకెట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout