'గజేంద్రుడు' ఆర్య కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది - ఆర్.బి.చౌదరి

  • IndiaGlitz, [Friday,April 07 2017]

ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. సీజీ వ‌ర్క్ అందుబాటులోకి రావ‌డం ఒక ప‌క్క మంచిదే అయినా, మ‌రో ప‌క్క అంతే రేంజ్‌లో సినిమాలోని రియాల్టీకి కాలం చెల్లింది. అడ‌పా ద‌డ‌పా ఒక‌ట్రెండు సినిమాలు మాత్ర‌మే ఓరిజిన‌ల్ లోకేష‌న్స్‌లో చిత్రీక‌రిస్తున్నారు. అలాంటిది ఓ సినిమాను అడ‌విలోనే షూట్ చేయ‌డ‌మంటే చిన్న విష‌యం కాదు...త‌మిళ ద‌ర్శ‌కుడు రాఘ‌వ చేసిన ప్ర‌య‌త్న‌మ‌దే. రాఘ‌వ‌కు ఆర్యలాంటి హీరో అండ దొర‌క‌డం ఓ ర‌కంగా అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంతే కాకుండా హీరో ఆర్య సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ముఖ్యంగా క‌నీస వ‌స‌తులు ఉండ‌ని అడ‌వుల్లో క్యాథ‌రిన్ వంటి సొగ‌స‌రి సినిమా కోసం ప‌నిచేసిందంటే సినిమాలో ఏ రేంజ్ కంటెంట్ ఉందో మ‌రి. ఇదంతా త‌మిళంలో రూపొందిన క‌దంబ‌న్ చిత్రం గురించి. మూడ ద‌శాబ్దాలుగా ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.బి.చౌద‌రి నిర్మాత‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గ‌జేంద్రుడు' అనే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 14న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో ఏప్రిల్ 6న జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌.బి.చౌద‌రి, వంశీపైడిప‌ల్లి, రానా, ఆర్య‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, సి.క‌ళ్యాణ్‌, పార‌స్‌జైన్‌, వాకాడ అప్పారావు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌, భీమినేని శ్రీనివాస‌రావు, గుణ‌శేఖ‌ర్‌, క్యాథ‌రిన్ థెస్రా త‌దిత‌రులు పాల్గొన్నారు. రానా బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి ఆడియో సీడీని వంశీ పైడిప‌ల్లి అందుకున్నారు.
మా సూప‌ర్‌గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్లో వ‌స్తున్న 89వ సినిమా 'గ‌జేంద్రుడు'. ఈ చిత్రం ఆర్య కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథ‌రిన్ ఎంతో చ‌క్క‌గా న‌టించింది. యువ‌న్ మంచి సంగీతాన్ని అందించారు. యువ‌న్ శంక‌ర్ రాజా మా బ్యాన‌ర్‌లో తొలిసారి వ‌ర్క్ చేస్తున్నారు. త‌మిళంలో కదంబ‌న్ ఆడియో మంచి హిట్ అయ్యింది. అలాగే తెలుగులో గ‌జేంద్ర‌న్ ఆడియో పెద్ద హిట్ అవుతుంద‌ని భావిస్తున్నాను. డైరెక్ట‌ర్ రాఘ‌వ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారని నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి తెలిపారు.
కంటెంట్ బేస్‌డ్ సినిమాల‌ను చేసే నిర్మాత‌ల్లో ఆర్‌.బి.చౌద‌రిగారు ముందుంటారు. అందుకు నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సుల‌భం కాదు. చౌద‌రిగారి స‌పోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథ‌రిన్ ఎంతో స‌పోర్ట్ చేసింది. త‌న అమ్మాయి అయినా, క‌నీస వ‌స‌తులు లేని అడ‌విలో ఎక్క‌డా ఇబ్బంది పెట్ట‌కుండా న‌టించింది. అందుకు త‌న‌కు థాంక్స్‌. డైరెక్ట‌ర్ రాఘ‌వ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. త‌న మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు త‌ను భ‌విష్య‌త్‌లో తెలుగు, త‌మిళంలో పెద్ద ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు అని హీరో ఆర్య అన్నారు.
వెంక‌టేష్ బాబాయ్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఎలాగో, సూప‌ర్‌గుడ్ ఫిలింస్ కూడా త‌న‌కు అలాగేన‌ని అంటుంటారు. ఆయ‌న సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌లో చేసిన సినిమాలు మంచి స‌క్సెస్‌ల‌ను సాధించాయి. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కొత్త జోన‌ర్ సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. అలాంటి కొత్త జోన‌ర్‌లో ఏప్రిల్ 14న రానున్న సినిమా గ‌జేంద్రుడు. ట్రైల‌ర్ అవుట్ స్టాండింగ్‌గా ఉంది. ఆర్య, నేను క‌లిసి బెంగ‌ళూర్ నాట్క‌ల్ సినిమాలో న‌టించాం. త‌ను నాకు మంచి మిత్రుడు. ఆర్య న‌టించిన 'గ‌జేంద్రుడు' చిత్రంతో తెలుగులో సూప‌ర్‌స్టార్ రేంజ్ చేరుకోవాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ద‌గ్గుబాటి రానా చెప్పారు.
నా, ఆర్య కాంబినేష‌న్‌లో నేను, ఆర్య క‌లిసి చేస్తున్న 10వ గ‌జేంద్రుడు. ప‌దకొండ‌వ సినిమా కూడా రానుంది. ఏప్రిల్ 14న రానున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నానని మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా అన్నారు. గ‌జేంద్రుడు సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. సినిమా కోసం అంద‌రూ బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ రాఘ‌వ‌గారు సినిమాలో ప్ర‌తి సీన్‌ను అమేజింగ్‌గా తెర‌కెక్కించారు. అడ‌విలో సినిమాను తీయ‌డం అంత సుల‌భం కాదు. ఆర్‌.బి.చౌద‌రిగారికి ధ‌న్య‌వాదాలు అని క్యాథ‌రిన్ థెస్రా తెలిపారు.
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులు చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేసి, ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళంలో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని అభిల‌షించారు.