Gaddar Daughter: ఎన్నికల్లో పోటీకి గద్దర్ కూతురు సిద్ధం.. కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ విడతల వారిగా అభ్యర్థుల ప్రకటన చేస్తుంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆశావాహులు పార్టీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల కూడా టికెట్ కోసం ఆశిస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి..
ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. తమకు టికెట్ ఇస్తారని కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తానని పేర్కొన్నారు. మా నాన్న గద్దర్ చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని.. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా అని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రి గద్దర్‌ను కాంగ్రెస్ పార్టీ చేరదీసిందని అండగా ఉంటామని చెప్పిందని గుర్తు చేశారు. అందుకే ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని వెల్లడించారు. ప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. గద్దర్ త్యాగాల మేరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని భావిస్తున్నామని వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు.
టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా..
కాంగ్రెస్ పార్టీ తన బిడ్డకు టికెట్ ఇస్తామని ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తుందన్నారు గద్దర్ భార్య విమల. తమ కుమార్తెకు టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేస్తానని.. వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నానని ఆమె తెలిపారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గద్దర్ మరణించిన సంగతి తెలిసిందే. గద్దర్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరుండి చూసుకున్నారు. గద్దర్ చనిపోకముందు ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో పాల్గొన్నారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గద్దర్ కుటుంబానికి టికెట్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments