Munugode ByPoll : మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్... కాంగ్రెస్, బీజేపీలను వద్దని కేఏ పాల్ పార్టీ నుంచి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రజా గాయకుడు గద్దర్ ఉపఎన్నిక బరిలో నిలిచారు. అది కూడా కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ తరపున. ఈ విషయాన్ని పాల్ అధికారికంగా ప్రకటించారు. పలు ప్రధాన పార్టీలు ఎన్నోసార్లు ఆఫర్ ఇచ్చినా పట్టించుకోని గద్దర్ ఇప్పుడు అనూహ్యంగా .. ఎలాంటి ఫేమ్ లేని ప్రజాశాంతి పార్టీలో చేరడం తెలుగు నాట సంచలనం సృష్టించింది. దీంతో గురువారం నుంచి గద్దర్ మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇటీవల కేఏ పాల్ పుట్టినరోజు సందర్భంగా మునుగోడులో జరిగిన కార్యక్రమంలో గద్దర్ పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను కాదని ఏకంగా ప్రజాశాంతి పార్టీలో చేరడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లను కాదని ప్రజాశాంతి పార్టీలోకి:
నిజానికి తెలంగాణతో పాటు ఏపీలోనూ గద్దర్‌కు పార్టీలకతీతంగా అభిమానులున్నారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలతోనూ గద్ధర్‌కు సత్సంబంధాలు వున్నాయి. ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు గద్ధర్‌తో భేటీ అయ్యారు. తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ గద్ధర్ కలిశారు. దీంతో ఆయన ఏదో ఒక పార్టీలో చేరతారని అప్పుడే ప్రచారం జరిగింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా గద్దర్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. దీనికి దారితీసిన కారణాలపై చర్చ జరుగుతోంది.
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్:
ఇకపోతే... కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉపఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు బరిలో నిలుస్తుండగా.. టీఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. దసరా నాడు అభ్యర్ధి ప్రకటన వుంటుందని ప్రచారం జరిగినప్పటికీ బీఆర్ఎస్ పనుల్లో కేసీఆర్ బిజీగా వున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అధికార పార్టీ నుంచి టికెట్ దాదాపుగా ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక, 6న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments