'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటున్న గద్దర్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజా గాయకుడు గద్దర్ పాటలు ఎంతో చైతన్యవంతంగా ఉంటాయి. అందర్నీ మేలుకొలిపే విధంగా ఉంటాయి. అలాంటి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ప్రజా గాయకుడిగా పేరు తెచ్చుకున్న గద్దర్ ఇప్పుడు 'మేలుకో రైతన్నా.. మేలుకో' అంటూ మరో సందేశాత్మక గీతంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'సాఫ్ట్‌వేర్ సుధీర్' చిత్రంలోని ఈ పాటను రచించి గానం చేశారు. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే చక్కని సందేశంతో కూడిన ఈ పాటలో గద్దర్ స్వయంగా నటించడం విశేషం.
ఈ పాట గురించి ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ - ''సాఫ్ట్‌వేర్ సుధీర్ చిత్రంలో 'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో' అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్‌గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు. సుడిగాలి సుధీర్‌హీరోగా, ధన్యాబాలక ష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బేనర్‌పై ప్రొడక్షన్ నెం-1గా కె.శేఖర్‌రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సందర్భంగా హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ - ''కథ చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించించి ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్‌తో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. హీరోయిన్ ధన్యా బాలక ష్ణతో షూటింగ్ చాలా ఫన్‌గా సాగుతోంది. అలాగే దర్శకుడు రాజశేఖర్ రెడ్డిలో మంచివిజన్ ఉంది. మా సినిమాలో గద్దర్ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుంది'' అన్నారు.
ప్రొడ్యూసర్ కె.శేఖర్‌రాజు మాట్లాడుతూ - ''సినిమా రంగంపై ఉన్న ఫ్యాషన్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాను. దర్శకుడు ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఆ భగవంతుడి దయ వలన షూటింగ్ సజావుగా సాగుతోంది. మా సినిమాలోని ఓ ఇన్‌స్పైరింగ్ సాంగ్‌ను ప్రజాగాయకుడు గద్దర్ పాడడంతోపాటు సినిమాలో నటించారు కూడా. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ - ''కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు మంచి సందేశాత్మక చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. మా సినిమాకు గద్దర్‌గారి పాట పెద్ద ఎస్సెట్ అవుతుంది. యువతకు మంచి సందేశాన్నిచ్చే 'మేలుకో రైతన్నా..' పాటను రచించి ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా పాడడమే కాకుండా సినిమాలో నటించడం నిజంగా మా అదృష్టం'' అన్నారు.
హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ - ''ఇందులో పెర్‌ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి సందేశం కూడా ఉంది'' అన్నారు.
సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ ఓ పాటలో నటించడం విశేషం. సీనియర్ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే, శివప్రసాద్, విద్యుల్లేఖ, టార్జాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: గౌతమ్‌రాజు, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్, మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, డాన్స్: శేఖర్ మాస్టర్, పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె, ఆర్ట్ డైరెక్టర్: నారాయణ ముప్పాల, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, పాటలు: సురేష్ ఉపాధ్యాయ, ప్రొడ్యూసర్: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout