ప్రజా గాయకుడు గద్దర్ మెచ్చిన 'నైజాం సర్కరోడా'

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

'హైద‌రాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొన్న ఒక యోధుడి కోడుకుగా చిన్న‌ప్ప‌టి నుంచి నాటి గాధ‌ల‌ను విన‌డంతో పాటు, అనేక బ్ర‌తుకు చిత్రాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశాను. ర‌జాకార్లు చేసిన దౌర్జ‌న్యాల‌ను, జ్యూస్రిపై నాజీలు చేసిన దౌర్జాన్యాలు కంటే ఎక్కువే. అందులో భాగ‌మే ఈ సినిమా క‌థ‌' అన్నారు ద‌ర్శ‌కుడు రాజు దుర్గే. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధార్ధ జాద‌వ్, జ్యోతి సుభాష్, జాకీర్ హుస్సేన్ న‌టీన‌టులుగా తెర‌కెక్కిన చిత్రం 'నైజాం స‌ర్క‌రోడా'. మౌళి ఫిలింస్ పై ర‌త్నం ధ‌విజి స‌మ‌ర్ప‌ణ‌లో రాజ‌మౌళి నిర్మించారు. ఈ సినిమా ప్రివ్యూ షో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో ప్ర‌ద‌ర్శించారు. ఈ షోను ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ తో పాటు, ప‌లువురు తెలంగాణ రాష్ర్ట ప్ర‌ముఖులు వీక్షించారు.
అనంత‌రం గ‌ద్ద‌ర్ మాట్లాడుతూ , 'సినిమా రంగం చాలా గొప్ప‌ది. మ‌న‌సులో భావాల‌ను..ఆవేద‌న‌లను దృశ్య రూపంలో ఇక్క‌డే మ‌ల‌చ‌గ‌లం. సామాన్య ప్ర‌జ‌ల‌పై ర‌జాకార్లు ఎలాంటి ఆకృత్యాల‌కు పాల్ప‌డ్డార‌న్న‌ అంశాన్ని సినిమా లో చ‌క్క‌గా చూపించారు. ఆయుధాలతో పోరాటం చేసే వారిని నిరాయాధులు ఎలా ఎదుర్కున్నారు? ఎదుర్కోవాలంటే చేతిలో ఆయుధ‌మే ఉండాలా? మ‌న లో శ‌క్తి సామార్ధ్యాల‌నే ఎందుకు ఆయుధంగా మ‌లుచుకోకూడ‌దు అనే అంశం బాగుంది. ఆ పాత్ర‌ల్లో న‌టించిన న‌టీన‌టుల ఆహార్యాలు.. న‌ట‌న అద్భుతంగా ఉంది. ఇలాంటి చిత్రాల‌ను ప్ర‌జ‌లంతా ఆద‌రించాలి. అప్పుడే ఇలాంటి క‌థ‌లు మ‌రిన్ని రావ‌డానికి అవ‌కాశం ఉంది' అన్నారు.
చిత్ర నిర్మాత రాజ‌మౌళి మాట్లాడుతూ, ' భార‌త‌దేశ చ‌రిత్ర‌లో హైద‌రాబాద్ విముక్తి పోరాటం ఒక గొప్ప అధ్యాయం అయితే..అందులో సామాన్యుడు ఎదుర్కున్న విచిత్ర ప‌రిస్థితుల‌ను దేశ చ‌రిత్ర‌లోనే మ‌రొక అధ్యాయంగా భావించ‌వ‌చ్చు. ఇందులో ఉన్న నాటి ప‌రిస్థితుల‌ను, సంస్కృతి, భాష‌, పోరాట తీరు, హాస్యం ఈ సినిమా చేయ‌డానికి ప్రేర‌ణ‌గా నిలిచాయి. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమాను ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా' అని అన్నారు.
ప్రోఫెస‌ర్ కోదండ‌రాం మాట్లాడుతూ, 'ర‌జాకార్ల చేతిలో అప్ప‌టి ప్ర‌జ‌లు ఎలా న‌లిగిపోయారు? ఎన్ని అవ‌స్థులు ప‌డ్డారు. వారిపై తిర‌గ‌బ‌డి ఎలా నిల‌బ‌డ్డార‌నే అంశాలు వాస్త‌వికంగా చ‌క్క‌గా తీశారు. టెక్నిక‌ల్ గా సినిమా బాగుంది. సినిమా మంచి విజ‌యం సాధించాలి' అని అన్నారు.
అలాగే షో ను వీక్షించిన తెలంగాణ‌ ప్ర‌ముఖులు విట్ట‌ల్, చంద్రన్న‌, ర‌వీంద్ర చారి, శ్రీనివాస్, శుగ‌ర‌బేగం త‌దిత‌రులు సినిమా బాగుంద‌ని, ఇలాంటి క‌థ‌లున్న సినిమాల‌ను ప్రేక్ష‌కులంతా ఆద‌రించాల‌ని కోరారు.

More News

21న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'పిశాచి-2'

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం "పిశాచి-2ష. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్. నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు.

నా కెరీర్ మొత్తంలో నేను నటించిన డిఫరెంట్ సినిమా 'లంక'

సీనియర్ కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `లంక`. రోలింగ్రాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మిస్తున్నారు.

'కొత్త కుర్రోడు' పాటలు మినహా షూటింగ్ పూర్తి

లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా `కొత్త కుర్రోడు`. లక్ష్మణ్ పదిలం నిర్మాత. మోహన్రావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్-శ్రీప్రియ, మహేంద్ర-ఆశ జంటలుగా నటిస్తున్నారు.

'ఉగ్రం' పోస్టర్ విడుదల

నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి,అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో

అమెరికాలో నాన్ స్టాప్ గా 14 రీల్స్ భారీ చిత్రం 'లై' షూటింగ్

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.