KA Paul:కేఏ పాల్ సంచలన నిర్ణయం.. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్ధర్ బహిష్కరణ

  • IndiaGlitz, [Wednesday,June 21 2023]

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను ఆయన పార్టీ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని ప్రజా శాంతి పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యవహారంపై కేఏ పాల్ మాట్లాడుతూ.. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి కొత్త పార్టీని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. గతేడాది అక్టోబర్ 5న గద్దర్ తన పార్టీలో చేరారని కేఏ పాల్ వెల్లడించారు. తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దిగుతున్నానని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన విషయం అందరికీ తెలుసునని కేఏ పాల్ తెలిపారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో గద్ధర్ డీల్ కుదుర్చుకున్నారని.. దీనిపై అడిగేందుకు తాను గద్ధర్ ఇంటికి వెళితే, ఆయన భార్య, కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నారని కేఏ పాల్ చెప్పారు.

పార్టీని ప్రకటించిన గద్ధర్ :

ఇకపోతే.. ‘‘గద్ధర్ ప్రజా పార్టీ’’ అంటూ గద్దర్ కొత్త పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి వెళ్లిన ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. పార్టీ జెండాపైనా ఆయన క్లారిటీకి వచ్చినట్లుగా సమాచారం. మూడు రంగులు, మధ్యలో పిడికిలి గుర్తు వుండే అవకాశం వుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా గద్ధర్, కార్యదర్శికి నరేష్, కోశాధికారిగా గద్ధర్ భార్య నాగలక్ష్మీ వ్యవహరించనున్నారు. గద్ధర్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.