Gaalodu: గాలోడు విజయం ప్రతీ ఒక్కరిది.. దర్శక, నిర్మాత రాజశేఖర్ రెడ్డి
- IndiaGlitz, [Wednesday,November 23 2022]
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన పక్కా మాస్అండ్‌యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో మంగళవారం సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'గాలోడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కష్టాన్ని నమ్మినవాడికి అదృష్టం వస్తుంది అని. సుధీర్ కష్టపడ్డాడు. అదృష్టం కూడా కలిసి వచ్చింది. సుధీర్ ఎంతో సహజంగా నటించారు. ఎంతో సిన్సియర్‌గా యాక్ట్ చేశారు. సినిమాలో ఏదో మంచి థ్రిల్ ఉంది. అందుకే సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఓ మిరాకిల్. సుధీర్ ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అవుతూనే వచ్చింది. ఈ చిత్రం కూడా హిట్ అయింది. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
హీరోయిన్ గెహ్నా సిప్పి మాట్లాడుతూ.. 'ఆడియెన్స్అంతా కూడా మా సినిమాకు సపోర్ట్ చేశారు. ఇంత మంచి ఆదరణను ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు, నటించేందుకు స్కోప్ ఉన్న ఇంత మంచి కారెక్టర్ రాసినందుకు సంస్కృతి ఫిల్మ్స్, నా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గారికి థాంక్స్. సినిమా కోసం అందరం చాలా కష్టపడి పని చేశాం. సుధీర్ సర్‌కి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మున్ముందు ఎన్నో విజయాలు చూడాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. 'ఇరవై ఏళ్ల నా సినీ ప్రయాణంలో మొదటి సారిగా ఇలాంటి సక్సెస్‌ను చూశాను. దర్శకుడు రాజశేఖర్ రెడ్డిది, నాది ఎన్నో ఏళ్ల బంధం. ఒకే రూంలో ఉన్నాం. తిన్నాం. రాజశేఖర్ రెడ్డికి సుధీర్ తోడయ్యాడు. ఏ నమ్మకంతో నాకు ఈ సినిమా ఇచ్చారో నాకు తెలీదు. కానీ థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాక ఎంతో ఆనందం వేసింది. ఇలాంటి ప్రశంసలు, ప్రేమ కోసమే మేం కష్టపడతాం. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు మేం ప్రయత్నిస్తాం. సుధీర్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారందరికీ ఐ లవ్యూ' అని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ.. 'నేను చిన్న సినిమాల ద్వారా ఎదిగాను. చిన్న సినిమాలు తీసేవారికి గాలోడు సినిమా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోయాను. సుధీర్ ఫ్యాన్స్ అంతా కూడా తండోపతండాలు వచ్చి సినిమాను చూస్తున్నారు. ట్రేడ్ ప్రకారం చెబుతున్నా ఈ సినిమా సూపర్ సక్సెస్. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయింది. రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలు రానున్నాయి. నిర్మాతగా, దర్శకుడిగా ఎంతో కష్టపడి రాజశేఖర్ రెడ్డి గారు ఈ సినిమాను తీశారు. కొందరికి మొదట్లోనే సక్సెస్ వస్తుంది.. ఇంకొందరికి కాస్త ఆలస్యంగా సక్సెస్ వస్తుంది.. కానీ నమ్మకంగా ఉన్న వారికి ఏదో ఒక రోజు కళామతల్లి అన్నం పెట్టి పంపిస్తుంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. సుధీర్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఎంతో సిన్సియర్‌గా వర్క్ చేస్తుంటారు. ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటే చాలు అని సుధీర్ అన్నారు. ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. గెహ్నా నటన బాగుంది. భీమ్స్ నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్' అని అన్నారు.
ఇంద్రజ మాట్లాడుతూ.. 'గాలోడు సినిమాకు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుధీర్ అమ్మానాన్నలు ఎంతగా సంతోషపడతారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను. సుధీర్ టాలెంట్ అందరికీ తెలిసిందే. ఎంతో కష్టపడి సినిమాను చేశారు. ఆ కష్టం నాకు తెలుసు. ఇది అసలు సిసలైన నిజమైన సక్సెస్. సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన జనార్ధన్ గారికి థాంక్స్. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. నిర్మాత దర్శకులైన రాజశేఖర్ గారికి థాంక్స్. ఈ గాలోడు సక్సెస్‌కి సుధీర్ ఫ్యాన్స్ కారణం. ఈ సినిమాను వారంతా ఎక్కడికో తీసుకెళ్లారు. సుధీర్ గారి అభిమానులందరికీ థాంక్స్' అని అన్నారు.
దర్శకనిర్మాత రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. 'గాలోడు సక్సెస్ ఏ ఒక్కరిదో కాదు.. టీం అందరిది. అందరికీ మనస్పూర్తిగా థాంక్స్ చెబుతున్నా. కథ రాయడం, సినిమా తీయడం, ప్రొడక్షన్ చేయడం ఈజీనే. కానీ సినిమాను రిలీజ్ చేయడమే చాలా కష్టం. మాకు సపోర్ట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ జనార్థన్ గారికి థాంక్స్. మళ్లీ సినిమా తీసి, సక్సెస్ కొట్టి.. ఇలా కలుస్తాను అని అనుకుంటున్నాను' అని అన్నారు.
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. 'గాలోడు సినిమాకు పెట్టిన ప్రతీ రూపాయి వెనక్కి వచ్చాకే సక్సెస్ మీట్ పెడదామని అన్నాను. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరిది ఈ విజయం. ఇన్ని థియేటర్లో నా సినిమా రిలీజ్ అవుతందని అనుకోలేదు. దీనికి కారణమైన జనార్ధన్ గారికి థాంక్స్. ఆయనకు రుణపడిపోయాను. నేను అభిమానులు అని అనను. నా ఫ్యామిలీ అంటారు. ఈ విజయం ప్రతీ ఒక్కరిదీ. ప్రతీ ఒక్క ఇంట్లో ఉండే వారిది. ప్రతీ తల్లిదండ్రులది. ఎందుకంటే వారు నన్ను కొడుకులా చూశారు. ఈ సినిమా వాళ్ల సినిమా అనుకుని చూశారు. ప్రతీ ఒక్క ప్రేక్షకుడికి పాదాభివందనం. జీవితాంతం మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈరోజు ఇక్కడకు వచ్చిన ఇంద్రజ గారికి థాంక్స్. ఇంత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాను నమ్ముకున్న ఏ ఒక్కరికీ నష్టం రాలేదు. పెట్టిన రూపాయి వెనక్కి వచ్చింది. ఇప్పుడు చాలా గర్వంగా మేం అంతా కూడా ఈ సినిమా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. గెహ్నా గారికి మున్ముందు ఇంకా మరిన్ని విజయాలు చేకూరాలి. సినిమాను ఆదరించిన తెలుగు ప్రజలందరికీ థాంక్స్. ప్రతీ సినిమా బాగుండాలి.. అన్ని సినిమాలు చూడండి.. ఇక్కడకు వచ్చినందుకు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్' అని అన్నారు.