అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న 'గాలిసంపత్' మార్చి 11న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్ఫణలో రూపొందుతోన్నచిత్రం 'గాలి సంపత్`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తూ.. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడంతో సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చింది. వరుసగా ఐదు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా `గాలి సంపత్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా..
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``నా మిత్రుడు ఎస్ క్రిష్ణ నిర్మిస్తున్నఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నేను సమర్పిస్తున్నాను. మార్చి 11న విడుదలయ్యే `గాలిసంపత్` అద్భుతమైన నటీనటులతో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వస్తోంది. అందర్నీ అలరించే వెరైటీ సినిమా ఇది`` అన్నారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - ``నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ గాలిసంపత్ పాత్ర చాలా డిఫరెంట్. ఇది ఒక కొత్త క్యారెక్టర్. కొత్తదనం ఉన్న మంచి సినిమా..కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు హృదయాన్నితాకే గుడ్ ఎమోషన్స్ ఉన్న `గాలిసంపత్` అందర్నీ ఆకట్టుకుంటుంది`` అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ``ఈ మహాశివరాత్రి రోజు మీ అభిమాన థియేటర్లలో మీ సమక్షంలో నేను మా నాన్న కలవబోతున్నాం..ఈ మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్లలో సిద్ధంకండి`` అన్నారు.
దర్శకుడు అనీష్ మాట్లాడుతూ - ``ఈ మార్చి 11న విడుదలయ్యే `గాలిసంపత్` తప్పకుండా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంది`` అన్నారు.
నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ - ``ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ రోజే డబ్బింగ్ స్టార్ట్ చేశాం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి11న మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments