అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న 'గాలిసంప‌త్' మార్చి 11న విడుద‌ల‌

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ఫ‌ణ‌లో రూపొందుతోన్నచిత్రం 'గాలి సంప‌త్'. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తూ.. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తుండ‌డంతో సినిమాకి స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా 'గాలి సంప‌త్' రూపొందుతోంది. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ 'గాలి సంప‌త్‌'గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా..

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ''నా మిత్రుడు ఎస్ క్రిష్ణ నిర్మిస్తున్నఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ నేను స‌మ‌ర్పిస్తున్నాను. మార్చి 11న విడుద‌ల‌య్యే 'గాలిసంప‌త్' అద్భుత‌మైన న‌టీన‌టుల‌తో మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి వ‌స్తోంది. అంద‌ర్నీ అల‌రించే వెరైటీ సినిమా ఇది'' అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర‌ప్ర‌సాద్ మా‌ట్లాడుతూ - ''నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ గాలిసంప‌త్ పాత్ర‌ చాలా డిఫ‌రెంట్‌. ఇది ఒక కొత్త క్యారెక్ట‌ర్‌. కొత్త‌ద‌నం ఉన్న మంచి సినిమా..కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు హృద‌యాన్నితాకే గుడ్ ఎమోష‌న్స్ ఉన్న 'గాలిసంప‌త్' అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది'' అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ''ఈ మహాశివరాత్రి రోజు మీ అభిమాన థియేటర్లలో మీ సమక్షంలో నేను మా నాన్న కలవబోతున్నాం..ఈ మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్లలో సిద్ధంకండి'' అన్నారు.

దర్శ‌కుడు అనీష్ మాట్లాడుతూ - ''ఈ మార్చి 11న విడుద‌ల‌య్యే 'గాలిసంప‌త్' త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది'' అన్నారు.

నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ - ''ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ రోజే డబ్బింగ్ స్టార్ట్ చేశాం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మార్చి11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు