‘కళ్యాణ్ దేవ్’ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి కధాబలం కలిగిన చిత్రాలను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించటం అన్నది ఇటీవల కాలంలో ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న వైనం గమనార్హం. ఇదే కోవలో మూడు ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థలు ఓ చిత్ర నిర్మాణానికి నడుం బిగించాయి.
భలే భలే మగాడి ఓయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను ప్రస్తుతం ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ఇటీవలే ‘వెంకీ మామ’ వంటి ఘనవిజయం సాధించిన చిత్రాన్ని నిర్మించిన ‘పీపుల్ మీడియా ఫాక్టరీ‘, మరో చిత్ర నిర్మాణ సంస్థ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‘ తో కలసి ఈ చిత్ర నిర్మాణానికి సమాయత్తమవుతున్నాయి.
నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘విజేత’ వంటి ఓ మంచి కథాబలం కలిగిన చిత్రంతో వెండితెరకు కథానాయకునిగా పరిచయమయిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు ‘కళ్యాణ్ దేవ్‘ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. విక్టరీ వెంకటేష్ ‘నమో వెంకటేశ’, మహేష్ బాబు ‘దూకుడు’ వంటి చిత్రాలకు రచనా సహకారం అందించటం తో పాటు, అహ నా పెళ్ళంట, పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం,సౌఖ్యం, డిక్టేటర్ వంటి పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత ‘శ్రీధర్ సీపాన’ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్న ‘శ్రీధర్ సీపాన‘మాట్లాడుతూ...’ రచయితగా నాకున్న అనుభవంతో ఓ మంచి కథను దర్శకునిగా పరిచయం కావటానికి సిద్ధం చేసుకున్నాను. ఈ కధకు హీరో ‘కళ్యాణ్ దేవ్‘ సరైన నాయకుడని అనిపించింది. ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కధా చిత్రం గా దీనికి రూపకల్పన చేయటం జరిగింది. హీరో పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకునిగా నన్ను పరిచయం చేస్తున్న నిర్మాతలకు సర్వదా కృతజ్ఞుడను. వారి గౌరవాన్ని పెంచే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తానని నమ్మకంగా చెప్పగలనన్నారు ‘శ్రీధర్ సీపాన‘.
ఈ ఏడాది మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం లోని ఇతర నటీ నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments