సర్ధార్ - సరైనోడు సినిమాల మధ్య మా సినిమా రిలీజ్ కి కారణం అదే: నాగేశ్వరరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు, రాజ్‌తరుణ్, సోనారికి, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఈడోరకం ఆడోరకం. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్ఫ్యూజన్ డ్రామా కథాంశంగా రూపొందిన ఈడో రకం ఆడో రకం చిత్రాన్ని ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డితో ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
ఈ సినిమాని ముందుగా విష్ణు సోలో హీరోగా చేద్దాం అనుకున్నాం. అయితే... రాజా రవీంద్ర ఫోన్ చేసి రాజ్ తరుణ్ కి ఈ సినిమా చూపించాం. బాగా నచ్చింది చేస్తానంటున్నాడు అని చెప్పారు. వెంటనే బిగ్ కాంబినేషన్ అవుతుంది. మంచి లుక్ వస్తుంది అన్నాను. ఆతర్వాత రాజ్ తరుణ్ ఇమేజ్ కి తగ్గట్టు ఫన్ పెంచాం. ఆ విదంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
విష్ణు - రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఈ సినిమా చేసారు కదా..విష్ణు - మనోజ్ కాంబినేషన్లో ఈ సినిమా చేయచ్చు కదా..?
ఇది ఇద్దరు స్నేహితుల కథ. అన్నదమ్ముల కథ కాదు.
ఇంతకీ..ఈడోరకం ఆడోరకం కథ ఏమిటి..?
ఇద్దరు స్నేహితులు అబద్దాలు చెబుతూ వాళ్ల పనులు చేయించుకుంటూ ఉంటారు. అలా అబద్దాలు చెప్పడం వలన వాళ్ల బంధువులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేదే ఈ కథ. ప్రస్తుతం అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత సపరేట్ గా ఉండాలనుకుంటున్నారు. ఈ సినిమా అమ్మాయిల ఆలోచనలో మార్పు తీసుకువస్తుంది అనుకుంటున్నాను.
రాజేంద్రప్రసాద్ పాత్ర ఎలా ఉంటుంది..?
రాజేంద్రప్రసాద్ గారు విష్ణు తండ్రి పాత్ర పోషించారు. ఆయన్ని కన్ ఫ్యూజ్ చేయడమే విష్ణు, రాజ్ తరుణ్ టార్గెట్.
హీరోయిన్స్ సోనారిక, హేబ్బా పటేల్ గురించి..?
ముంబాయి నుంచి వచ్చే హీరోయిన్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. వీళ్లిద్దరూ కూడా అంతే. పాత్రకు తగ్గట్టు ఇద్దరూ చాలా బాగా నటించారు.
మోహన్ బాబు గారు ఈ సినిమా రైట్స్ తీసుకోక ముందు నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారి దగ్గరకి వెళ్లాను. అలాగే...వెంకటేష్ తో సినిమా చేద్దామని వెళ్లాను. మోహన్ బాబు గారు ఈ సినిమా రైట్స్ తీసుకున్నారని తెలిసిన తర్వాత వెళ్లలేదు.
సర్ధార్ గబ్బర్ సింగ్, సరైనోడు ఈ రెండు సినిమాలు మధ్య మా సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే పొగరుతో కాదు మా సినిమా మీద ఉన్న నమ్మకంతో. అయినా ఆ రెండు మాస్ సినిమాలు. మాది ఫ్యామిలీ ఎంటర్ టైనర్.
మీరు 15 ఏళ్లలో తక్కువ సినిమాలే చేసారు..? అలాగే స్టార్స్ తో సినిమాలు చేయలేదు కారణం ఏమిటి..?
15 ఏళ్ల జర్నీలో ఎప్పుడూ ప్రొడ్యూసర్ తో ప్రాబ్లమ్ రాలేదు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ వెళుతున్నాను. చేసిన సినిమాలు తక్కువే అయినా 6టీన్స్, గర్లఫ్రెండ్, సీమశాస్త్రి...ఇలా 7 హిట్ సినిమాలు చేసాను. ఒకటి రెండు ప్లాఫ్స్ వస్తే తర్వాత మళ్లీ హిట్ వచ్చేది. ఇక స్టార్ హీరోలుతో అంటే...నాగార్జున, వెంకటేష్, రవితేజ లతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. కానీ..ఆ టైమ్ లో ఎందుకనో చేయలేకపోయాను. వాళ్లతో చేయడానికి ఇంకా టైమ్ రాలేదేమో అనుకుంటాను.
సుశాంత్ తో ఆటాడుకుందా సినిమా చేస్తున్నారు కదా..? ఈ సినిమా ఎంత వరకు వచ్చింది..?
పాటల చిత్రీకరణ మిగిలింది. త్వరలోనే పాటల చిత్రీకరణ పూర్తి చేసి జూన్ ఫస్ట్ వీక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించారు కదా..? మళ్లీ ఎప్పుడు సినిమా..?
ప్రొడక్షన్ అంటే నాకు ఇష్టం. ఎప్పటికైనా ప్రొడ్యూసర్ గా హిట్ సినిమా చేయాలనేది నా టార్గెట్.
నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి..?
నరేష్ హీరోగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించే సినిమా చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout