ఆర్జీవీకి ఎఫ్‌డబ్ల్యూఐసీ షాక్..!
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు లాక్డౌన్ సమయంలో కరోనా వైరస్ వల్ల ఇబ్బంది కలగలేదు. ఏకధాటిగా సినిమాలు చేసి ఏటీటీల్లో విడుదల చేసి టెక్నీషియన్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ టెక్నీషయిన్స్కు ఇతర టెక్నిషియన్స్ రూపంలో కొత్త సమస్య వచ్చి పడింది. కరోనా సమయంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయిన ఆర్జీవీ టెక్నీషియన్స్‌కు దాదాపు కోటి రూపాయలకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉందట. ఆ చెల్లింపులు చేయకపోవడంతో సదరు టెక్నీషియన్స్ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీ).. వర్మతో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నారట.
టెక్నీషియన్స్‌కు ఇవ్వాల్సిన డబ్బులు కోసం ఎఫ్‌సీఐ సెప్టెంబర్ 17 నుంచి లేఖలు పంపుతున్నా ఆయన స్పందించలేదు. అలాగే లీగల్ నోటీసలు పంపినా వర్మ పట్టించుకోలేదు. కరోనా సమయంలో పనిచేయించుకుని ఎంత మొర పెట్టుకున్న చిల్లిగవ్వ కూడా ఆర్జీవీ ఇవ్వడం లేదని ఎఫ్‌డబ్ల్యూఐసీ అధ్యక్షుడు బీఎన్ తివారి పేర్కొన్నారు. ప్రస్తుతం 12 ఓ క్లాక్ సినిమాను విడుదల చేయడంలో బిజీగా ఉన్న వర్మ..ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout