మోహన్‌బాబు, రానాల మధ్య ఫన్నీ కాన్వర్సేషన్.. బయటపడ్డ అసలు నిజం
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని మూవీ ఈవెంట్స్ అనుకోకుండా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిందే ‘ఆచార్య’ టైటిల్. మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్‌కు హాజరై అనుకోకుండా టైటిల్ రివీల్ చేసి నాలుక కరుచుకున్నారు. అలాగే నేడు జరిగిన ‘మోసగాళ్లు’ ఈవెంట్లో కూడా ఆసక్తికరంగా ఓ విషయం బయటకు వచ్చింది. మంచు విష్ణు, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటిని ఆహ్వానించారు.
అయితే రానా చెప్పిన సమయానికంటే చాలా ఆలస్యంగా కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మోహన్‌బాబు సరదాగా.. "ఏమయ్యా! ఎప్పుడో ఏడు గంటలకు రమ్మంటే ఇప్పుడు వచ్చావు. రేపు నువ్వు నాతో సినిమా చేస్తున్నావు కదా.. ఏడు గంటలకు రమ్మంటే పది గంటలకు వస్తాను" అన్నారు(నవ్వుతూ). దానికి రానా నవ్వుతూ "నేను మీ ఇంట్లోనే షూటింగ్ చేసుకుంటాను సార్.. మీరు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే షూటింగ్ చేసుకుంటాను" అని అన్నాడు. ఈ సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగడంతో పాటు ఓ విషయాన్ని అనుకోకుండా బయటపెట్టినట్టైంది.
అదేంటంటే.. రానా దగ్గుబాటి నిర్మాణ సారథ్యంలో మోహన్‌బాబు నటిస్తున్నారనే విషయం అనూహ్యంగా బయటపడింది. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో నటించి మెప్పించి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ఇప్పుడు బిజీబిజీగా మారిపోతున్నారు. కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సన్నాఫ్ ఇండియా'. ఈ సినిమా తరువాత రానా నిర్మాణంలో మోహన్‌బాబు సినిమా చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా వివరాలన్నింటినీ అధికారికంగా ప్రకటిస్తారని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com