close
Choose your channels

సురభి గ్రూప్‌కు సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!

Thursday, April 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సురభి గ్రూప్‌కు సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి!

చరిత్రను చూపి సమాజంలో జరిగే మంచి చెడులను తెలిపేది ‘నాటకం’ అనే విషయం అందరికీ తెలిసిందే. కాయాకష్టం చేసి అలసి సొలసి పోయిన శ్రమజీవికి ఉపశమనం కల్పించేదీ నాటకమే. రాజుల కాలం నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన నాటకాలు నేడు చాలా వరకు అంతరించి పోతున్నాయి. నాటక రంగాన్నే నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నాటక రంగమే జీవితంగా బతుకుతున్న సురభి కళాకారులు, వారి పిల్లలు కలిసి నాటకాలు ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తున్నారు. తరతరాలుగా ఈ కుటుంబం నాటకంపైనే ఆధారపడి జీవిస్తోంది.

నాటకాలతో జీవనం సాగిస్తూ...

హైదరాబాద్‌‌కు చెందిన సురభి థియేటర్స్ వారు ప్రతి వారం పలు ప్రాంతాల్లో సురభి గ్రూప్ పౌరాణిక నాటకాలు వేస్తూ జీవనం సాగిస్తుండే వారు. నిజంగా వీరి తెలివితేటలను మెచ్చుకోవచ్చు. ప్రత్యేకమైన స్పెషల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన లైటింగ్ స్కీమ్‌లతో పౌరాణిక నాటకాలకు పేరుగాంచిన ఈ బృందం. ఈ కుటుంబానికి చెందిన అందరూ నాటకాలు వేస్తూనే జీవనం సాగిస్తున్నారు. సూక్ష్మంగా అన్వయించిన మేకప్, రంగురంగుల బ్యాక్‌డ్రాప్‌లు, ఆకర్షణీయమైన దుస్తులు, వినూత్న టెక్నిక్స్ ద్వారారా సృష్టించబడిన మేజిక్ సురభి గ్రూప్ బలం. ఈ గ్రూప్ చేసే నటనను ప్రేక్షకులు బాగా మెచ్చుకునేవారు.

నేడు పీకల్లోతు కష్టాల్లో...

అలా ప్రతి వారం నాటకాలు వేస్తూ జీవనం సాగించే ఈ కుటుంబం లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కుటుంబంలోని 50 మంది సభ్యులు ఏ పనీ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 50 మందిలో చాలా మంది చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నారు. ఈ కష్ట సమయంలో మీ సాయం కోసం సురభి గ్రూప్స్ వేయి కళ్లతో వేచి చూస్తోంది. మీకు తోచినంత సాయం చేసి పెద్ద మనసు చాటుకోండి. సాయం చేయదలిచిన వారు కింద ఉన్న బ్యాంకు అకౌంట్ నంబర్‌కు లేదా గూగుల్ పే ద్వారా నగదు పంపగలరు. ఇంకా ఇందుకు సంబంధించి సందేహాలుంటే కింద ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయ్.. క్లారిటీ కోసం సంప్రదించవచ్చు కూడా!. సురభివారి కష్టాలను పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా.. బాహుబలిమూవీ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.

Bank Details:-
Name : Sri Venkateswara Surabhi theatre,
A/C No: 3327101010863,
CANARA Bank, Hyderabad Chandanagar branch, saving account,
IFSC Code: CNRB0003327,
MICR Code: 500015063,
PAN : AAXAS4079F
Google pay and Phone pay number: 9494507007
Address: 20-1/sc/216, Surabhi Colony, Serilingampally, Rangareddy dist - 500019 Telangana

Surabhi Jayachandra Varma
Secretary, Sri Venkateswara Surabhi Theatre
Website: www.surabhitheatre.com
Email: surabhijayachandra@gmail.com
9912924723, 9494507007

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment