బ్రిడ్జి మీద ఫన్నా? ఫ్రస్ట్రేషనా?
Send us your feedback to audioarticles@vaarta.com
అనిల్ రావిపూడి తీసే సినిమాలను చూస్తే ఈ జనరేషన్‌తో పాటు నిన్నటి జనరేషన్ జ్ఞాపకాలను కూడా గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంటారేమోనని అనిపిస్తుంది. పాత పాటల రీమేక్ కావచ్చు, కొన్నిసార్లు రెట్రో స్టైల్ కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో లుంగీలు కట్టించడం కావచ్చు.. ఏదైనా..! తాజాగా ఎఫ్2లోనూ ఆయన కూలీ నెంబర్ 1ని, ఖైదీ నెంబర్ 786ని గుర్తు చేశారు.
అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ ను ఓ బ్రిడ్జి మీద తీయనున్నారు. దానికోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో బ్రిడ్జి సెట్ వేశారు. తాజాగా జరిగే ఈ షెడ్యూల్లో హీరోలు వరుణ్‌తేజ్, వెంకటేశ్ మాత్రమే కాదు.. నాయికలు తమన్నా, మెహ్రీన్ కూడా పాల్గొంటారు. తెరమీద ఉన్నవారి ఫ్రస్ట్రేషన్ తెరముందు ఉన్నవారికి ఫన్‌గా ఉండాలనేది ఈ సినిమా కాన్సెప్ట్. చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ సంక్రాంతికి తెరమీదకు రానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అని ఇప్పటికే టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments