డిశంబర్ 7 నుండి డెహ్రాడూన్ లో 'ఫుల్ మూన్'

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

గ్లిట్టర్స్‌ ఫిల్మ్‌ అకాడమీ బ్యానర్‌పై ప్రకాష్‌ ఠాకూర్‌ నిర్మాతగా హర్షకుమార్‌, డాలీ శర్మ, నదీమ్‌ భార్గవ్‌, కామ్న సింగ్‌, అభిలాష్‌, రుహానీ శర్మ మొదలగువారు నటీనటులుగా..., గతంలో 'బమ్‌ ధమ్‌' వంటి చిత్రాన్ని రూపొందించిన దీపక్‌ బల్‌దేవ్‌.. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కించనున్న 'ఫుల్‌ మూన్‌' చిత్రం డిశంబర్‌ 7 నుండి నాన్‌స్టాప్‌గా 20 రోజుల పాటు డెహ్రాడూన్‌లో షూటింగ్‌ జరుపుకోనుంది.
ఈ సందర్భంగా ....

చిత్ర దర్శకుడు దీపక్‌ బల్‌దేవ్‌ మాట్లాడుతూ..''మంచి కథ, కథనంతో 'ఫుల్‌ మూన్‌' అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. బ్యాడ్‌ డెసిషన్స్‌ మేక్‌ బెటర్‌ స్టోరీస్‌ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. మ్యూజిక్‌కి మంచి స్కోప్‌ ఉన్న ఈ చిత్రానికి బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అభిలాష్‌ సంగీతాన్ని అందించనున్నారు. మూడు జంటల కథతో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్‌ డిశంబర్‌ 7 నుండి నాన్‌స్టాప్‌గా డెహ్రాడూన్‌లో 20 రోజుల పాటు జరుపుకోనుంది. ఈ షెడ్యూల్‌ అనంతరం ఈ చిత్రం సిమ్లా, కసోల్‌లలో చిత్రీకరణ జరుపుకోనుంది.'' అని అన్నారు.

హర్షకుమార్‌, డాలీ శర్మ, నదీమ్‌ భార్గవ్‌, కామ్న సింగ్‌, అభిలాష్‌, రుహానీ శర్మ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్‌ గొలిడే, కొరియోగ్రఫీ: సాగర్‌దాస్‌, డైలాగ్స్‌: అశ్వినీసింగ్‌, కెమెరా: ఖన్నా, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: టి. భిక్షపతి, కో-డైరెక్టర్‌: హేమంత్‌ పువ్వాడ, స్టైలిష్ట్‌: అదితి దుత్తా, మేకప్‌ ఛీప్‌: నాగేశ్వరరావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: వేణు చిటినేని,
ప్రొడ్యూసర్‌: ప్రకాష్‌ ఠాకూర్‌,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: దీపక్‌ బల్‌దేవ్‌.

More News

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు.

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు.

చెన్నై వాసుల‌కు బ‌న్ని స‌హాయం

వ‌ర‌ద‌ల కార‌ణంగా అక్కడి ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వంతో పాటు సినిమా ప‌రిశ్రమ కూడా ముందుకు వ‌చ్చింది.

మ‌రో హ‌ర్ర‌ర్ మూవీ చేస్తున్న అందాల తార‌..

ఇటీవ‌ల హ‌ర్ర‌ర్ మూవీతో ఆక‌ట్టుకున్నఅందాల తార... మ‌రో హ‌ర్ర‌ర్ మూవీతో అల‌రించేందుకు రెడీ అవుతుంది.

మెగా హీరో ఫంక్షన్ కు ప్రభాస్..

బాహుబలి పార్ట్ 1తర్వాత గ్యాప్ వచ్చినప్పటికీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వేరే సినిమా చేయకుండా బాహుబలి 2 కోసం కసరత్తులు స్టార్ట్ చేశాడు.

చెన్నై వరద బాధితులకు 3 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన వరుణ్ తేజ్

ప్రస్తుతం చెన్నై నగరం లో ఉన్న పరిస్థితులకు స్పందిస్తూ, యువ నటుడు వరుణ్ తేజ్ తన వంతు సహాయం గా 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.