నాని సినిమాతో పూర్తిస్థాయి విలన్ గా..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం కృష్ణార్జునయుద్ధం`. మేర్లపాక గాంధి దర్శకుడు. ఈ చిత్రంలో నాని రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. సాధారణంగా నాని సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉంటాయి. ఇటీవల విడుదలైన రెండు పాత్రల ఫస్ట్ లుక్స్, దారి చూడు అంటూ సాగే పాట తాలుకూ లిరికల్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ మోడల్, నటుడు రవి అవన్ నటిస్తున్నాడు.
గతంలో పూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇజం` సినిమాతో రవి అవన్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అయితే ఆ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయమైనా...కృష్ణార్జునయుద్ధం` మాత్రం పూర్తి స్థాయి విలన్ గా మంచి గుర్తింపునిస్తుందని ఆశావాహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో హ్యూమన్ ట్రాఫికర్ పాత్రలో నటిస్తున్న రవి.. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిళా స్వరాలను అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments