వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు, ఇన్సెంటివ్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల (మార్చి) పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కాగా.. మొదట పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు జీతాల కోత ఉంటాయని కేసీఆర్ మీడియా ముఖంగా చెప్పారు. అయితే వారి నుంచి వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంతేకాదు.. అవసరమైతే ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్సెంటివ్ను ఒకటి రెండు రోజుల్లో కేసీఆరే స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా.. ప్రగతి భవన్లో బుధవారం రాత్రి జరిగిన కీలక భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే.. పూర్తి జీతాలతో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారన్న మాట. ఈ ప్రకటన గురించి విన్న వైద్య, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చిన అనంతరం ఆయా సంఘాలు మీడియా ముందుకు ధన్యవాదాలు తెలపనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout