థియేటర్లకు ఫుల్ పర్మిషన్.. సినిమాల రిలీజ్‌కు నిర్మాతల ఆసక్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా లాక్‌డౌన్ సమయంలో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. సినిమాల్లేక చిన్న చిన్న ఆర్టిస్టుల కుటుంబాలు చితికిపోయాయి. ఇటీవలే థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ 50 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించాలన్న నిబంధన కాస్త ఇబ్బందికరంగానే మారింది. తాజాగా అంటే ఈ నెల ఒకటో తేదీ నుంచి థియేటర్లలోకి వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తుండటంతో సినీ పరిశ్రమ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు.
కోవిడ్ నిబంధనల సడలింపు ప్రక్రియలో భాగంగా సినిమా థియేటర్లలోకి వందశాతం ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్ర హోం శాఖ అనుమతిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్. ఫలితంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని థియేటర్లలోకి వంద శాతం ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. అయితే, కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలన్న షరతు విధించారు. థియేటర్లలోకి పూర్తిస్థాయి ప్రేక్షకులను అనుమతిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నిన్న మొన్నటి వరకూ చిత్రాలను రిలీజ్ చేయడానికి వెనుకడుగు వేసిన నిర్మాతలు ప్రస్తుతం మాత్రం చిత్రాలను విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలలో మొదటి శుక్రవారమైన ఈ నెల 5న ఏకంగా మూడు సినిమాలు విడుదలకానున్నాయి. ఈ మూడు స్ట్రయిట్ చిత్రాలు కాగా, ఒకటి మాత్రం డబ్బింగ్ చిత్రం. ఈ నెల 5న ‘కళత్తిల్ సందిప్పోం’, ‘ఏలే’, ‘చిదంబరం రైల్వేగేట్’ వంటి చిత్రాలతో పాటు తెలుగు హీరో రవితేజ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘క్రాక్’ కూడా విడుదలకానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com