‘‘ఫుల్ కిక్కు’’ అంటోన్న ఖిలాడీ.. రవితేజ ఫ్యాన్స్‌కి మాస్ ట్రీట్

  • IndiaGlitz, [Thursday,January 27 2022]

మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్‌గా నటిస్తోన్న సినిమా 'ఖిలాడి' . రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హీరో రవితేజ పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా నుంచి 'ఫుల్ కిక్కు' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. శ్రీమణి సాహిత్యం అందించగా.. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఆలపించారు.

శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించగా.. రవితేజ హీరోయిన్ డింపుల్ హయాతి తన మాస్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. వాస్తవానికి ఈ పాటను ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన సాయంత్రం విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా ఆడిపాడనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఖిలాడీలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. వీర సినిమా తర్వాత రమేశ్ వర్మ - రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు వున్నాయి. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఖిలాడీ కాకుండా రవితేజ చేతిలో నాలుగు సినిమాలు వున్నాయి. ధమాకా, రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీతో పాటు టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

ఇందులో రామారావు ఆన్ డ్యూటీ విడుదల తేదీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. శరత్ మండవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు

More News

‘‘విరాట్’’ సేవలకు ఇక విశ్రాంతి.. రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ వీడ్కోలు

73వ గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ ‘విరాట్‌’కు వీడ్కోలు పలికారు.

ఉదయం చిరంజీవి.. ఇప్పుడు శ్రీకాంత్‌, తెలుగు ఇండస్ట్రీపై కోవిడ్ పడగ

తెలుగు చిత్ర పరిశ్రమపై కోవిడ్ పగబట్టినట్లుగా  వుంది. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మీ, మంచు విష్ణు,

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించిన కేసీఆర్.. ఏ జిల్లాకు ఎవరంటే..?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఏకకాలంలో పార్టీ అధ్యక్షులను నియమిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

15 ఏళ్ల నాటి ‘‘ముద్దు’’ కేసు.. శిల్పా శెట్టికి కోర్టులో ఊరట

బ‌హిరంగ ముద్దు కేసు నుంచి బాలీవుడ్ సీనియర్ న‌టి శిల్పా శెట్టికి కోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది.

కోవిడ్ బారినపడ్డ చిరంజీవి.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మహమ్మారి వదల్లేదంటూ ట్వీట్

దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం కోవిడ్ బారినపడుతున్నారు.